The home remedies to get rid of unwanted hairs on face legs and hands | beauty tips | beauty remedies

Home remedies to remove unwanted hairs beauty tips

home remedies, unwanted hairs remove tips, tips to remove unwanted hairs, beauty tips, beauty remedies, beauty home remedies, beauty tips remove hairs, hairs remove tips

home remedies to remove unwanted hairs beauty tips : The best home remedies to remove unwanted hairs on face, legs and hands.

అవాంఛిత రోమాలను నివారించే చిట్కాలు

Posted: 07/03/2015 12:16 PM IST
Home remedies to remove unwanted hairs beauty tips

సాధారణంగా కొందరు మహిళల్లో ముఖం, చేతులు, కాళ్లపై అవాంఛిత రోమాలు పెరుగుతూ నిత్యం ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇవి చర్మసౌందర్యాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి. వీటిని నివారించేందుకు త్రెడింగ్, షేవింగ్, వ్యాక్సింగ్ లాంటి కృత్రిమ పద్ధతులు అందుబాటులో వున్నాయి. కానీ.. కొందమందికి అవి పడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాటిని సరిగ్గా చేయకపోతే చర్మంపై దద్దర్లు, ఎర్రటి పొక్కులు రావడంతోపాటు తీవ్ర నొప్పి కలుగుతుంది. పైగా.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ వున్నాయి. కాబట్టి.. వాటికంటే ఇంట్లోనే కొన్ని రెమెడీలు చేసుకుని, వాటి ద్వారా సులభంగా రోమాలు తొలగించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* శెనగపిండి-గంధం : ఒక పాత్రలో శెనగపిండి, గంధం ఒక్కోటి రెండు టేబుల్‌ స్పూన్లు చొప్పున తీసుకోవాలి. అలాగే తాజా మీగడ, ఆముదం, రోజ్‌వాటర్‌లు ఒక్కో స్పూన్‌ చొప్పున తీసుకుని కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఇలా అన్నింటిని వేసిన అనంతరం బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న ప్రాంతంలో రాయాలి. 15 నిముషాల తర్వాత అపసవ్య దిశలో మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.

* మసూర్ దాల్ : కొద్దిగా ఎర్ర కందిపప్పును మిక్సీలో వేసి మీడియంలో గ్రైండ్‌ చేసుకోవాలి. అనంతరం అందులో కొద్దిగా తేనె, గంధం, ముల్తాని మట్టి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసుకోవాలి. ఆరిన తరువాత అపసవ్య దిశలో మర్దనా చేసుకోవాలి. అనంతరం చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాల పెరుగుదల వేగం చాలావరకు తగ్గుతుంది.

* పంచదార-నిమ్మరసం : పంచదార, నిమ్మరసం, తేనెల మిశ్రమాలతో అవాంఛితరోమాలు తొలగించుకోవచ్చు. పంచదారను నీటితో కలిపితే. అది మంచి ఎక్స్ ప్లోయేట్ గా పనిచేస్తుంది. నిమ్మరసం ఒక అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. అవాంఛితరోమాలను శరీరం నుండి తొలగిస్తుంది. ఈ మూడింటిని వేర్వేరుగా చర్మానికి పట్టించుకుని, కాసేపు తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

* పసుపు-శెనగపిండి: ఒక పాత్ర తీసుకుని అందులో పసుపు, శెనగపిండి, వేపాకు పొడి, పచ్చి పాలు తదితరాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట వుండాలి. పూర్తిగా ఆరిపోకముందే చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇది సహజసిద్ధమైన యాంటీసెప్టిక్‌గా పనిచేసి రోమాలు పెరగకుండా నిరోధిస్తుంది.

* గుడ్డు-నిమ్మరసం : ఒక పాత్రలో గుడ్డు తెల్లసొన వేసి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి.. ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఈ మాస్క్‌ లాగేస్తే.. అవాంఛిత రోమాలు దాంతోపాటు ఊడి వచ్చేస్తాయి. ఈ మాస్క్ చర్మాన్ని బిగుతుగా, మృదువుగా ఉంచుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unwanted hair remove tips  home remedies  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more