Hair Beauty Tips | hair home remedies | hair healthy foods

Hair beauty tips home remedies healthy foods

hair health tips, hair beauty tips, hair home remedies, hair home tips, hair healthy benefits, hair healthy foods

Hair Beauty Tips home remedies healthy foods : The Healthy Home Remedies For Hairs which helps to imrprove the shiny and health of hairs.

అందమైన శిరోజాలకు ఇంటి చిట్కాలు

Posted: 06/20/2015 07:56 PM IST
Hair beauty tips home remedies healthy foods

అందం విషయంలో శిరోజాలు కూడా ప్రముఖపాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని అందంగానూ, ఆరోగ్యంగానూ వుంచుకోవాలి. జుట్టు అందంగా, నలుగురినీ ఆకర్షించేలా మెరవాలంటే కొన్ని ఇంటి చిట్కాలు అందుబాటులో వున్నాయి. సాధారణంగా వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఈ చిట్కాలు మరింత మెరుగ్గా పనిచేసే శిరోజాల అందాన్ని పెంచుతాయి. ఇంతకీ ఆ ఇంటి చిట్కాలేంటో తెలుసుకుందామా..

శిరోజాల అందాన్ని మెరుగుపరిచే చిట్కాలు :

* కొంతమంది జుట్టు దట్టంగా లేదని బాధపడుతుంటారు. అటువంటి వారు ఎగ్ హెయిర్ ప్యాక్ జుట్టుకు పట్టిస్తే త్వరలో ఫలితం పొందుతారు. రెండు గుడ్లు కొట్టి, అందులో రెండు స్పూన్ల నీరు కలపాలి. జుట్టును తడిచేసి చేసిన అనంతరం తలమీద ఈ గుడ్డుసొన మిశ్రమం పట్టించాలి. బాగా అద్ది 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి లేదా నెలకు రెండుసార్లు చేయడం ద్వారా జుట్టు దట్టంగా పెరుగుతుంది.

* శిరోజ సంరక్షణకు ఆలుగడ్డ ఎంతో సహకరిస్తుంది. తాజాగా వుండే ఒక ఆలుగడ్డను తీసుకుని దాని నుంచి రసాన్ని తీయాలి. ఆ రసంలో కోడిగుడ్డు తెల్లసొనను, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, మాడుకు పట్టించుకోవచ్చు. ఇలా చేస్తే.. వెంట్రుకలు ఆరోగ్యవంతంగా, మెరుగ్గా అవుతాయి.

* తాజా ఉసిరికాయల గుజ్జును తలకు పట్టిస్తే ఎన్నో ఫలితాలను పొందవచ్చు. ఈ గుజ్జును జుట్టుకు పట్టించడం వల్ల శిరోజాలకు మంచి రంగు వస్తుంది. తల త్వరగా నెరవదు. జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. మొత్తంగా జుట్టు ఆరోగ్యంగా, మెరుగ్గా తయారవుతుంది. మెదడుకి చలువ చేస్తుంది.

* అరడజను అరటిపండ్లు, రెండు గుడ్లు, ఒక కప్పు బీర్ తీసుకోండి. ఈ మూడింటిని ఒక కప్పులో వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో స్నానం చేయాలి. గుడ్లలోని ప్రోటీన్, అరటిలోని తేమ కలిసి జుట్టు మృదువుగా అందంగా, దట్టంగా తయారు చేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hair beauty tips  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more