Tomato, Mango And Milk are Best Home Remedies For skin beauty | beauty tips | Beauty home remedies

Skin beauty tips tomato mango milk home remedies

beauty tips, beauty home remedies, beauty face packs, beauty remedies, tomato beauty remedies, tomato beauty benefits, tomato beauty tips, milk beauty benefits, milk beauty tips, healthy beauty tips, beauty tips for skin

Skin Beauty Tips Tomato mango milk home remedies : Experts saying that Tomato, Mango And Milk are Best Home Remedies For skin beauty.

టమోటా, మ్యాంగో, పాలు.. చర్మానికి ఉత్తమ రెమెడీలు

Posted: 06/06/2015 02:55 PM IST
Skin beauty tips tomato mango milk home remedies

చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చడంలో టమోటా, మ్యాంగో, పాలు సమర్థవంతంగా పనిచేస్తాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు. చర్మసౌందర్యాన్ని పెంపొందించే పోషక విలువలు ఈ మూడింటింలో పుష్కలంగా వుంటాయి. అందుకే వీటిని ఉత్తమమైన రెమెడీలుగా పేర్కొంటున్నారు. మరి.. ఈ మూడింటితో కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

* రోజూ ఓ గ్లాసు టమోటా జ్యూస్‌తో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని బ్యూటీషియన్లు అంటున్నారు. ఎందుకంటే చర్మసౌందర్యానికి అవసరమయ్యే కొల్లాజిన్ ఉత్పత్తికి సహాయపడే విటమిన్ సి టమోటోల్లో పుష్కలంగా వుంటుంది. అలాగే వీటిలోని బెర్రీస్‌ కూడా చర్మ సౌందర్యానికి ఎంతగానో తోడ్పడుతాయి. వీటిలోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

* పచ్చిమామిడికాయ పేస్ట్ లేదా బాగా పండిన మామిడి పండ్ల గుజ్జులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి, 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది. ఇంకా అవసరం అయితే అందులో కొద్దిగా బాదం ఆయిల్ కూడా మిక్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. బాగా పండిన మామిడిపండ్ల గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా క్లే లేదా ఓట్స్, తేనె, పాలు వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* ప్రతిరోజూ ఉదయం చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద పాలు చిలకరించి చేత్తో బాగా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే ముఖం మెరిసిపోతుంది. అలాగే చీజ్‌తో కూడా మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. చీజ్‌ను తురిమి, మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా అయిన చీజ్‌ను ముఖం, మెడకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి మరకలు తొలగిపోతాయి.

* ఇక చర్మ సౌందర్యానికి శెనగపిండి బెస్ట్‌గా పనిచేస్తుంది. శెనగపిండి, రోజ్ వాటర్ రెండు మిక్స్ చేసి ముఖానికి పట్టిస్తుంటే 4 వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం పేస్టు కూడా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అంతే కాకుండా ఇది ముఖంలో మచ్చలు, మెటిమలను మాయం చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  skincare tips  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more