Home Remedies for Damage Hair | Healthy Home Tips | Beauty Tips

Beauty home remedies for damage hair

beauty tips, damage hair tips, damage hair beauty tips, damage hair home remedies, damage hair remedies, damage hair home tips, olive oil home remedies, olive oil beauty benefits, olive oil beauty remedies

Beauty Home Remedies For Damage Hair : The best home remedies for damage hair. Mainly Olive oil is best remedy which prevent different types of hair problems.

డ్యామేజ్ హెయిర్ కి ఇంటి చిట్కాలు..

Posted: 05/27/2015 05:39 PM IST
Beauty home remedies for damage hair

వేసవిలో ఎండతాపం వల్ల జుట్టు సమస్యలు తలెత్తుతాయి. కేశాలు పొడిబారిపోవడం, జుట్టు చివర్లో చిట్లిపోయి రాలిపోవడం, మెరుగుదనం కోల్పోవడం, ఇంకా ఇతర ఇబ్బందులు తప్పవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వేసవిలో హెయిర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా వున్నాయి. అలాంటప్పుడు జట్టును డ్యామేజ్ కాకుండా రక్షించుకోవాలంటే.. అందుకు అనుగుణంగా కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు. జుట్టు సంబంధిత సమస్యలను త్వరగా ఉపశమనం పొందవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

డ్యామేజ్ హెయిర్ కి చిట్కాలు :

* పెరుగు-మెంతుల హెయిర్ ప్యాక్ : ముందుగా మెంతుల్ని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ను పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకూ, మాడుకు పట్టించి గంట పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి మూడుసార్లు జుట్టుకు పూసుకుంటే.. జుట్టు రాలిపోయే సమస్యను అధిగమించవచ్చు. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా వుండడంతోపాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.

* ఆలివ్ ఆయిల్ ప్యాక్‌ : ఒక పాత్ర తీసుకుని అందులో ఒకకప్పు గడ్డ పెరుగు, మూడు చెంచాలు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్టులో నుంచి కాస్త మిశ్రమాన్ని తీసుకుని.. దానిని మాడుపై వేసి ఓ పది నిముషాలపాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్ తో జుట్టు మొత్తం కిందవరకూ ప్యాక్‌లాగా వేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి.

చివరగా : కేశాలను సంరక్షించడంలో ఆలివ్ ఆయిల్ ఎంతో తోడ్పడుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. ఆలివ్ ఆయిల్‌తో జుట్టు మృదువుగా తయారవుతాయి. మాడంతా పొడిగా మారినట్లు లేదా చుండ్రు సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆలివ్ ఆయిల్ ప్యాక్‌ను ట్రై చేస్తే, డాండ్రఫ్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Damage hair tips  beauty tips  olive oil beauty benefits  home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more