Beauty Tips To Get Soften Hands from Dry Skin | beauty home remedies

Beauty home remedies soften hands dry skin

beauty tips, hands beauty tips, soften beauty tips, soften hands tips, dry skin beauty tips, home beauty remedies

Beauty Home Remedies Soften Hands Dry Skin : Beauticians giving some beauty home remedies for hands to get soften from dry skin.

పొడిబారిన చేతులు మృదువుగా మారాలంటే..

Posted: 05/16/2015 07:11 PM IST
Beauty home remedies soften hands dry skin

ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయేవరకు మహిళలు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. తీరక సమయం లేకుండా తమ చేతులకు పని చెబుతుంటారు. ఆఫీసులో కీ బోర్డును దంచికొట్టడం కంటే.. ఇంట్లో చేసే పనుల వల్ల చేతులకు గాయాలవుతుంటాయి. ముఖ్యంగా వంటింట్లో ఏదైనా వంటకం చేస్తున్నప్పుడు.. అప్పుడు ఆ వేడి నుంచి వెలువడే ఆవిరి వారి చేతులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీంతో మృదువుగా వున్న వారి చేతులు కాలక్రమంలో పొడిబారిపోతాయి. ఇక వేసవికాలంలో ఎండతాపం వల్ల, చలికాలంలో అధిక చల్లదనంతోనూ చేతులు పొడిగా మారుతాయి. అలాంటప్పుడు వాటిని తిరిగి మృదువుగా మార్చుకోవాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ అందుబాటులో వున్నాయి.

చేతుల్లో ముడతలు తగ్గించి, పొడిబారితనం నుంచి ఉపశమనం పొంది మృదువుగా తయారు చేసుకోవాలంటే.. రాత్రిళ్లు మాయిశ్చరైజ్ చేసుకోవాలని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. సాధారణ బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఇంట్లోనే కొన్ని రెమెడీలు తయారుచేసుకుని వాటిని చేతులకు పట్టిస్తే.. మంచి ఫలితం పొందవచ్చునని వారు చెబుతున్నారు. ఎందుకంటే.. సహజ పదార్థాలతో తయారయ్యే రెమెడీలు పోషక విలువలు అత్యధిక మోతాదులో వుంటాయని.. అవి నేరుగా చర్మం మీద ప్రభావం చూపడంతో పొడిగా వున్న చేతులు మృదువుగా మారుతాయని అంటున్నారు. మరి.. చేతులను మృదువుగా మార్చే ఆ హోమ్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందామా..

* ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా సెనగపిండి, కాస్త పాలు, నిమ్మరసం వేసి.. బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పేస్టులా తయారుచేసుకుని.. దాన్ని చేతులకు పూతలా రాయాలి. బాగా ఆరేంతవరకు అలాగే వుంచుకోవాలి. ఆరిన అనంతరం గోరువెచ్చని నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. అంతే! ఇలా ప్రతిరోజూ చేసుకుంటే.. చేతుల్లో చేరిన మృతకణాలు తొలగిపోగి, మృదువుగా తయారవుతాయి.

* ఒక గిన్నె తీసుకుని అందులో చెంచా గ్లిజరిన్‌ పోయాలి. అనంతరం అందులో అరచెంచా నిమ్మరసం, కొద్దిగా గులాబీ నీరూ వేసి బాగా కలియబెట్టాలి. పేస్టులా తయారైన ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకోవాలి. ఈ పూత బాగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో చేసుకుంటే.. చేతులు పొడిబారకుండా అందంగా కనిపిస్తాయి.

* ఒకవేళ చేతులు మరీ పొడిబారితే అందుకు ఓ సమర్థవంతమైన రెమడీ వుంది. అదేమిటంటే.. ఒక పాత్రలో అరటిపండు గుజ్జు తీసుకుని అందులో అరచెంచా తేనే వేసి బాగా కలుపుకోవాలి. పేస్టులా తయారుచేసుకున్న అనంతరం దాన్ని చేతులకు రాసుకోవాలి. కొద్దిసేపు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hands beauty tips  home beauty remedies  dry skin tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more