healthy food items which improves beauty of skin | beauty tips

Healthy food items which improves beauty of skin

healthy food items, beauty tips, beauty benefits, beauty products, beauty ingredients, beauty tips telugu, healthy beauty tips, healthy foods, health tips

healthy food items which improves beauty of skin : Healthy food items also improves skin beauty. In this types of food there are lot of nutrients available which contains health benefits as well as beauty.

పౌష్టికాహారంతో చర్మసౌందర్యం మీ సొంతం...

Posted: 04/01/2015 04:38 PM IST
Healthy food items which improves beauty of skin

సాధారణంగా చర్మసౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ రెమెడీస్, ఇతర ఆయుర్వేద ఔషధాలను ఉపయోగిస్తారు. వీటిలో వుండే గుణాలు సౌందర్యాన్ని పెంపొందించడంలో ఎంతో కీలకమైన పాత్రను వహిస్తాయి. ఇవి ఏ విధంగా అయితే సౌందర్యాన్ని పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయో.. అదేవిధంగా పౌష్టికాహారం కూడా దోహదపడుతుంది.

పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పౌష్టికాహారం ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యాన్ని కూడా మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ప్రస్తుతం ఉరుకుల పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు కాబట్టి.. అటువంటివారు పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకుంటే చాలు.. త్వరలోనే ఫలితాన్ని గమనించవచ్చు.

చర్మసౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కేవలం పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తుంటే చాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలు..
 
- ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువ నీటిని తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం కోసం నీరు దివ్యమైన ఔషధం. నీరు తీసుకోవడం వలన మీరు తాజాగా తయారవ్వడమే కాకుండా మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది.
 
- ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదే విధంగా శరీర చర్మానికి విటమిన్ల అవసరమౌతాయి. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

a) విటమిన్ సి : విటమిన్ సీ అన్ని రకాల పండ్లలో లభిస్తుంది. ఉదాహరణకు నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
 
b) విటమిన్ ఏ : బొప్పాయి, కోడిగుడ్డు
 
c) విటమిన్ బి : ఇది పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
 
d) విటమిన్ ఇ : వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy food items  beauty tips  health tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more