Beauty tips for younger looking skin

beauty tips, younger looking skin, skin softness tips, skin tips, beauty tips, beauty home remedies, beauty tips for skin

beauty tips for younger looking skin : The simple beauty tips to get younger looking skin without using any beauty products.

నిత్యం యవ్వనంగా వుండటానికి బ్యూటీ టిప్స్...

Posted: 03/04/2015 06:30 PM IST
Beauty tips for younger looking skin

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చర్మసౌందర్యంలోనూ మార్పలు సంభవిస్తాయి. అలాగే వయసు పెరుగుతున్నకొద్దీ సౌందర్యం తగ్గుతుంటుంది. తద్వారా చర్మం ముడతలుపట్టడం, మొటిమలు రావడం, నల్లని మచ్చలు ఏర్పడటం, కళ్ల కింద నల్లని ఛారలు, ముసలితనం వచ్చినట్లుగా... ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ద్వారా ఈ సమస్యలను నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చేమోగానీ.. వాటిని నిత్యం వాడాల్సి వుంటుంది. ఒకవేళ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడకాన్ని తగ్గిస్తే.. మళ్లీ చర్మసమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా నిత్యం యవ్వనంగా, సౌందర్యంగా కనిపించాలంటే అందుకు కొన్ని బ్యూటీ టిప్స్ ని పాటిస్తే చాలు!

నిత్యం యవ్వనంగా కనిపించాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సింది పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం! ఫ్రూట్, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహారాల్లో చర్మసౌందర్యాన్ని పెంపొందించే పోషకాలు పుష్కలంగా వుంటాయి. అటువంటి వాటినే ఎల్లప్పుడూ డైట్ లో తీసుకుంటే ఫలితం వుంటుంది. అందులోనూ మోనోశాచురేటెడ్ ఆయిల్, విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ విటమిన్లతో నిండిన ఆహారాలు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఇవన్నీ చేపట్లో అధిక మోతాదులో నిల్వవుంటాయి. అలాటే చేపల్లో వుండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ వర్చస్సును ఎంతో మేలు చేస్తాయి.

ఇక ముఖానికి సక్రమంగా రక్తప్రసరణ జరిగినప్పుడు చర్మసౌందర్యం పెరుగుతుంది. కాబట్టి.. తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయాల్సి వుంటుంది. కళ్లు బాగా అలసిపోయినప్పుడు చల్లటి దోసకాయ ముక్కల్ని రెండు మూడు నిమిషాలు కనురెప్పల మీద వుంచుకోవాలి. ఇలా చేస్తే.. కళ్లకు ఉపశమనం లభించడమే కాకుండా, ఇవి కళ్ల కింద నలుపును తగ్గిస్తుంది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విధంగా ఈ టిప్స్ పాటిస్తే.. యవ్వనంగా వుండొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  younger looking skin tips  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more