Natural home make hair masks beauty tips banana hair pack egg pack

beauty tips, hair beauty tips, hair tips, hair problems, hair remedies, hair home remedies, home made hair packs, hair packs, banana hair pack, egg hair pack, beauty hair tips, healthy beauty tips, hair health tips

natural home make hair masks beauty tips banana hair pack egg pack

జుట్టు సంరక్షణకు హెయిర్ మాస్క్

Posted: 12/03/2014 05:31 PM IST
Natural home make hair masks beauty tips banana hair pack egg pack


జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లకు వెళ్లి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవడం కంటే.. ఇంట్లోనే కొన్ని ప్యాక్స్ తయారుచేసుకుని రెగ్యులర్ వాటిని అప్లై చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జుట్టు సమస్యలు వస్తుంటాయి. జుట్టు రాలిపోవడం, లేదా చిట్లిపోవడం, లేదా తెల్లగా మారడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. అటువంటి వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే కొన్ని హోంమేడ్ మాస్క్’లు అందుబాటులో వున్నాయి. వాటిని ఎలా తయారుచేస్తారో.. వాటివల్ల కలిగే ఉపయోగమేమిటో తెలుసుకుందాం...

1. అరటిపండు-తేనె-నిమ్మరసం (బనానా హెయిర్ ప్యాక్) : పొడిబారిన లేదా చిట్లిన జుట్టు కోసం ఈ హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. అరటిపండును ఒక గిన్నెలో గుజ్జుగా చేసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలలోని చర్మానికి, మొదళ్ళకు పట్టే విధంగా అప్లై చేయాలి. అరగంటవరకు అలాగే వదిలేసి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. తల వెంట్రుకలు సున్నితంగా, మంచి షైనింగ్’తో మొరుస్తాయి.

2. గుడ్డు-తేనె-నిమ్మరసం (ఎగ్ హెయిర్ ప్యాక్) : రెండు గుడ్లను పగులగొట్టి అందలోని పచ్చ సొన, ఒక ఎగ్ వైట్ కలిపి బాగా మిక్స్ చేయాలి. అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే మరో గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకొని తలకు పట్టించి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధమైన ప్యాక్స్ డ్యామేజ్ అయిన హెయిర్ కోసం ఉపయోగించాల్సి వుంటుంది.

3. మెంతులు : ఒక కప్పు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీటితో సహా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్’ను జుట్టుకు పట్టించాలి. ఇది బాగా తడి ఆరిన తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. జుట్టు పోషణకు మెంతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్టాటిక్ హెయిర్ కోసం ఈ పేస్ట్ బాగా పనిచేస్తుంది.

4. వెనిగర్-తేనె: ఒక కప్పులో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో వెనిగర్, తెనె రెండూ సమపాళ్ళలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల కురులకు అధిక శక్తిని వస్తుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ ను వెంటవెంటనే ఉపయోగించకూడదు. వెనిగర్ ఎక్కువ సేపు తలలో ఇంకడం వల్ల కురులకు చెడు ప్రభావం కలిగిస్తుంది. నిర్జీవమైన కురుల కోసం ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది.

5. ఎగ్-తేనె-క్యాస్ట్రో ఆయిల్ : ఒక బౌల్లో గుడ్డులోని పచ్చసొనతోబాటు రెండు చెంచాలా తేనె, రెండు చెంచాలా క్యాస్ట్రో ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల హెయిర్ బ్రేకేజ్ కాకుండా అరికడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  hair home made packs  home remedies  telugu news  health tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more