Simple make up tips and tricks for eyes

eye makeup tips, mascara tips, makeup tips, beauty tips, beauty tips in telugu, beauty tips for eyes, eye beauty tips, healthy beauty tips for eyes, makeup tips for eyes

simple make up tips and tricks for eyes which can prevent infections and other problems

అందమైన కళ్లకు సింపుల్ మేకప్ టిప్స్!

Posted: 10/22/2014 05:34 PM IST
Simple make up tips and tricks for eyes

మహిళలు అందంగా కనిపించడంలో కళ్లు ప్రముఖపాత్రను పోషిస్తాయి. కళ్ల చుట్టు చేసుకునే మేకప్ టిప్స్ వారి అందాన్ని మరింతగా పెంచుతాయి. అయితే కళ్లకు మేకప్ వేసుకునే సమయంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కళ్లకు మేకప్ వేసుకునే సమయంలో దురదగా అనిపిస్తుంది. కాబట్టి అటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని మేకప్ అప్లై చేసుకుంటే మంచిది. కళ్లకు ఎన్నోరకాల మేకప్ టిప్స్ అందుబాటులో వున్నాయి. వాటిని అప్లై చేసుకునే విధానం.. ఇతర వివరాల గురించి తెలుసుకుందాం..

1. కళ్లను మేకప్ చేసుకునే విషయంలో కొన్నిరకాల బ్రష్ లను ఉపయోగించాల్సి వస్తుంది. అటువంటి బ్రష్సులను తరుచూ వాడకుండా నిత్యం మార్చుకుంటే మంచిది. లేదా బ్రష్సులను నిత్యం శుభ్రం చేస్తూ వుండాలి. ఒకవేళ అలాచేయకపోతే.. అందులో వుండే డస్ట్ కళ్లలోకి చేరి, ఇన్ఫెక్షన్ అవుతుంది. కాబట్టి బ్రష్సులను నిత్యం శుభ్రం చేసుకుని, జాగ్రత్తగా అప్లై చేసుకోవడం శ్రేయస్కరం!

2. క్రిమీ షాడో : ఈ రకమైన మేకప్ కళ్లను ఎంతో అందంగా కనిపించేలా చేస్తుది. కానీ.. వీటిని రెగ్యులర్ గా చేసుకుంటే మాత్రం కళ్ల ఇన్ఫెక్షన్ సమస్యలు రావడం ఖాయం. ముఖ్యంగా ఐషాడో పౌడర్స్ ను దూరంగా వుంచాలి. ఎందుకంటే ఇవి కళ్లలో పడినప్పుడు చాలా దురదగా వుంటుంది.

3. ఇన్నర్ లైనింగ్ : ఫ్యాషన్ పేరుతో కొన్ని ప్రత్యేకమైన మేకప్ టిప్స్ వాడుతుంటారు. అందులో ఇదికూడా ఒకటి! కళ్లక్రింది రెప్పలకు లోపలివైపుగా లైనింగ్ వేసుకోవడానికి వైట్ కోల్ పెన్సిల్ ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల కళ్లు అందంగా కనిపిస్తాయి గానీ.. ఈ ఇన్నర్ లైనింగ్ సున్నితమైన కళ్లను చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. బయటివైపు బాగానే వుంటుంది కానీ.. లోపలివైపు చేసుకుంటే చాలా ప్రమాదకరం!

4. మస్కరా : ఈమధ్య కాలంలో ఇటువంటి మేకప్ టిప్ ఎక్కువ అయిపోయింది. ఇది చూడటానికి ఎంతో అందంగా కనిపించేలా చేస్తుంది కానీ.. కళ్లకు చాలా ప్రమాదం కూలి కలిగిస్తుంది. ఎందుకంటే.. ఇందులో వుండే ఫైబర్ కళ్లకు ఇరిటేషన్ కలిగిస్తుంది. మెల్లమెల్లగా మండటం ప్రారంభం అవుతాయి. కాబట్టి చాలావరకు దూరంగా వుంటే మంచిది.

5. కొంతమంది అందంగా కనిపించడం కోసం వివిధ రకాలా కలర్స్ ను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల కూడా కళ్ళు ఇన్ఫెక్షన్ కు గురి అవుతాయి .కాబట్టి కళ్లకు డార్క్ బ్లాక్ కలర్ ఐలైనర్ ఉపయోగించడం కంటే.. లైటర్ షేడ్స్ ను మాత్రమే ఉపయోగించాలి.

6. సెన్సిటివ్ గా ఉన్నకళ్ళకోసం చాలా సురక్షితమైన పద్దతులను అనుసరిస్తే చాలా మంచిది. క్లీన్ బ్రష్ లను ఉపయోగించడంతో పాటు, మేకప్ వేసుకోవడానికి ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. చేతుల ద్వారా, గోళ్ళు ద్వారా కూడా కళ్ళు చాలా త్వరగా ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంటాయి. అలాగే మేకప్ వేసేప్పుడు, తొలగించేప్పుడు కళ్ళను రుద్దకుండా నివారించాలి.

7. కళ్ల మేకప్ కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ అందుబాటులో వున్నాయి. అందులో ప్రైమర్ - ఫౌడేషన్ మేకప్ చెదిరిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇవి ఇతర పద్ధతుల కంటే చాలా స్మూత్ గా ఉంటాయి . సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇటువంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eye beauty tips  makeup tips  health tips  eye problems  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more