Chocolate therapy for face

chocolate therapy, beauty tips, beauty tips with chocolate therapy, chocolate therapy tips, chocolate therapy news, international chocolate day, chocolate face wash

chocolate therapy for face which is invented by scientists on international chocolate day. This is a very simple method and easy to apply.

చాకొలేట్ తో మెరిసే సౌందర్యం.. మీ సొంతం!

Posted: 09/15/2014 03:32 PM IST
Chocolate therapy for face

సాధారణంగా చాకొలేట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు తినడానికి ఇష్టపడతారు. అయితే ఆ చాకొలేట్ నుంచి మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చునని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. ఇంటర్నేషనల్ చాకొలేట్ డే సందర్భంగా శాస్త్రజ్ఞులు నిర్వహించిన కొన్ని పరిశోధనల ఆధారంగా చాకొలేట్ థెరపీని ఆవిష్కరించారు. ఈ చాకొలేట్ థెరపీని ప్రతిరోజూ పాటిస్తే.. కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పొందవచ్చని వారు పేర్కొంటున్నారు. చర్మానికి చక్కటి మెరుపులను ఇవ్వడంతోపాటు నిరాశ నిస్పృహలను కూడా దూరం చేస్తుంది. అంటే... ఇది కేవలం అందాన్నే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందని నిపుణుల సలహా!

చాకొలేట్ థెరపీతో అందాన్ని పొందే విధానాలు :

మొదటి విధానం : 50 గ్రాముల చాకొలేట్ ను తీసుకుని దానిని వేడినీటిలో రంగరించుకోవాలి. అది పలుచగా వున్నప్పుడే ముఖానికి మాస్క్ లాగా పట్టించుకోవాలి. బాగా ఆరిన తర్వాత వేడినీటితో శుభ్రం చేసుకుని.. పొడిగా వుండే బట్టతో తుడుచుకోవాలి.

రెండవ విధానం : మొదట 50 గ్రాముల చాకొలేట్ తీసుకుని దానిని వేడినీటిలో బాగా కలుపుకోవాలి. అనంతరం అందులో ఓ స్పూన్ ఆలివ్ ఆయిల, కోడిగుడ్డు సొన కలిసి.. బాగా మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిముషాల వరకు అలాగే వుంచుకోవాలి. తర్వాత వేడినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

మూడవ విధానం : 50 గ్రాముల చాకొలేట్ తీసుకుని అందులో కోక్ పౌడర్, 2 చెంచాల ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడినీటిలో కలుపుకోవాలి. కొద్దిసేపటివరకు వుంచుకున్న తర్వాత వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే డెడ్ సెల్స్ తొలగిపోయి.. మెరుగైన చర్మసౌందర్యం వస్తుంది.

ఇలా ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో వీలున్నప్పుడల్లా ముఖానికి స్ర్కబ్ చేసుకుంటే.. మెరుగైన చర్మసౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ముఖంపై వున్న మొటిమలు, కళ్లకింద వుండే నల్లటి ఛారలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. రాత్రి నిద్రపోవడానికి ఒక గంట ముందు ఇలా చేసుకుంటే ఫలితాన్ని తొందరగా పొందుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chocolate therapy  beauty tips  health tips  international chocolate day  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more