How to apply lipstick

Lipstick: How to apply lipstick, tricks for getting lipstick to last longer, how to make lips looks plumper

Lipstick: How to apply lipstick, tricks for getting lipstick to last longer, how to make lips looks plumper

లిప్ స్టిక్ జాగ్రత్తలు

Posted: 02/12/2013 01:41 PM IST
How to apply lipstick

lipstick

ముఖంలో ఎన్ని హంగులు కవర్‌చేసుకున్నా, ముఖ్యంగా పెదాలు ఆకర్షణీయంగా కనిపించకపోతే, అందం మందగించినట్టే. అందుకే చాలామంది లిప్‌స్టిక్‌లు వాడుతూవుంటారు. లిప్‌స్టిక్‌ వేసుకోవడం కూడా ఒక కళ. సరైన పద్దతిలో లిప్‌స్టిక్‌ వేసుకోకపోతే చుట్టూవున్నవారు మీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారన్నది ఖాయం. అందుకే లిప్‌స్టిక్‌ వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, మీ పెదాల్ని ముద్దొచ్చేలా మల్చుకోవచ్చు.

లిప్‌స్టిక రాసుకునే ముందు పాలతో ముంచిన దూదితో పెదాలను బాగా క్లీన్‌ చేసుకోవాలి. పెదాలు శుభ్రంగా లేకపోతే లిప్‌స్టిక్‌ మెరుపు, అందము కనపడదు. ఫౌండేషన్‌ క్రీము రాసుకుని బాగా ఆరనివ్వండి. మొదటి లిప్‌సిక్‌ని అంటి అంటనట్లుగా రాసుకుంటు పోతూ క్రమంగా మెల్లమెల్లగా అద్దుకుంటూ పోవాలి. బ్రాండెడ్‌ లిప్‌స్టిక్‌ల్నే వాడటం మంచిది. లిప్‌స్టిక్‌ హడావిడిగా వేసుకోవద్దు. నిదానంగా అప్లై చేయండి.ఇక లిప్‌స్టిక్‌ అలవాటులేని యువతుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతివారూ లిప్‌స్టిక్‌ రాసుకోవడానికి ఇష్టపడరు. అటువంటివారు తమ పెదాలు గనుక నల్లగా గానీ, డార్క్‌ బ్రౌన్‌లో గానీ, పొడిగా గీతలు కానీ ఉన్నట్లు అనిపిస్తే అందుకు మరిన్ని చిట్కాలు మనింట్లోనే ఉన్నాయి. రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలు సబ్బుతో కడిగి, ఆవునెయ్యి రాస్తూవుంటే, కొద్ది రోజుల్లో మీ పెదాలు దొండపండులా మెరుస్తాయి.

వేడి వేడి కాఫీ, టీలు పెదాలకి పూర్తిగా ఆన్చి తాగకుండా కొద్ది కొద్దిగా ఊదుకుంటూ తాగుతుంటే, దాని ప్రభావానికి మృధువుగా ఉండే పెదాలు పాడవకుండా, నల్లబడకుండా ఉంటాయి. రోజంతా ఎటోకటు తిరగక తప్పదు. అప్పుడు పెదాలు ఎండిపోతున్నట్టు అనిపించి సాధారణంగా అందరూ నాలుకతో పెదాలు తడుపుతూ ఉంటారు. అలాకాకుండా, ఒక రుమాలు ఒక కొస కొద్దిగా తడిపి ఉంచుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మీ పెదాలు ఆ తడిబాగం తో తుడుచుకుంటూవుంటే, పెదాల్ని కని పించకుండా అంటిన మలినాలు, దుమ్ము పోయి పరిశుభ్రంగా ఉంటాయి. వీలైతే చిన్న వేసలీన్‌ సీసా కూడా దగ్గరుంచుకుని ఆరారగా పెదాలకు రాసుకుంటూ మీ పనుల మీద తిరగండి. పెదాలు వన్నె తగ్గకుండా ఉంటాయి. లిప్‌స్టిక్‌ కన్నా ఇదెంతో మేలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more