mumbai-juhu-aerodrome-is-the first-civil-aviation-airportభారతదేశంలో తొలి పౌరయాన సేవలు ప్రారంభమైంది ఇక్కడే..

Mumbai juhu aerodrome is the first civil aviation airport

Juhu Aerodrome, mumbai first civil court, mumbai civil court updates, Juhu Aerodrome updates, Juhu Aerodrome history, Juhu Aerodrome biography, Juhu Aerodrome gallery, Juhu Aerodrome photos, Juhu Aerodrome news, mumbai civil airport news, indian civil airports

Mumbai Juhu Aerodrome Civil Airport History Updates Biography : Juhu Aerodrome is located in Juhu, an upmarket residential suburb of Mumbai, India. It is used by small General Aviation aircraft and helicopters. Founded in 1928 as India's first civil aviation airport.

భారతదేశంలో తొలి పౌరయాన సేవలు ప్రారంభమైంది ఇక్కడే..

Posted: 08/22/2018 07:53 PM IST
Mumbai juhu aerodrome is the first civil aviation airport

చరిత్ర పుటంచుల్లో ఎన్నో రికార్డులను లిఖించుకున్న భారతదేశం.. ఇప్పటికీ దేశంలోని ప్రజలను సందేహాలలోకి తోసే అనేక విషయాలు వున్నాయి. వెలుగులోకి రాని కొన్ని నిఖార్సైన నిజాలను అన్వేషిస్తే.. ఔనా ఇది కూడా మన భారత దేశపు ఘనతేనా.? అన్ని సంభ్రమాశ్చర్యంలోకి వెళ్లక తప్పని అనేకానేక అంశాలు ఇంకా దాగి వున్నాయి. అటువంటి దాగివున్న నిజాల్లో జుహు విమానాశ్రయంను ఒకటిగా పేర్కొనవచ్చు.

ఎందుకంటే.. 928లో ప్రారంభించబడిన ఈ విమానాశ్రయం భారతదేశపు మొట్టమొదటి పౌరవిమానయాన విమాశ్రయంగా పేరుపొందింది. ఇది ముంబయి శివార్లలో జుహు వద్ద వున్న ఓ చిన్న విమానాశ్రయం. ఇక్కడి నుండి ప్రయాణీకులను చేరవేసే చిన్న పాటి విమానాలు, హెలీకాప్టర్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటాయి. రెండవ ప్రపంచయుద్ధం వరకు ఇది ముంబయి నగర ప్రధాన విమానాశ్రయంగా సేవలందించింది.

మరిన్ని విషయాలు :

1928లో ఈ విమానాశ్రయాన్ని ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రారంభించారు. అప్పటిలో ప్రారంభమైన న్యూ బాంబే ఫ్లైయింగ్ క్లబ్ సభ్యులకు ఇందులో శిక్షణా కార్యకలాపాలు, వైమానిక సేవలు మాత్రమే లభించేవి. వర్షాకాలంలో పౌరవిమాన సేవలకు ఈ విమానాశ్రయం అనువు కాకపోవడంతో కార్యకలాపాలు నిలిపివేసేవారు. అయినా 1932 నాటికి ఇక్కడ చాలాసౌకర్యాలు కల్పించబడ్డాయి. ఆ సంవత్సరకాలలో భారత పరిశ్రమల పితామహుడిగా వ్యవహరించే జె.ఆర్.డి.టాటా ఇక్కడి నుండి భారతదేశ మొట్టమొదటి విమాన తపాలా సేవలను ప్రారంభించడంతో భారత వైమానిక రంగంలో నూతన శకం ప్రారంభమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Juhu airport  Juhu civil aviation  Juhu Aerodrome  Mumbai Civil Aiport  Indian Airports  

Other Articles