countries where sun never sets మిడ్ నైట్ నెస్ దేశాలంటే..? రాత్రి ఎరుగని ప్రాంతాలున్నాయని తెలుసా..?

Which countries are known as the land of the midnight sun

midnightness countries, midnight sun places, norway, ice land, sweden, artic region, antartic region, northern hemisphere, southern hemisphere, russia, america

During the summer months or from late May to late July, the sun never completely descends beneath the horizon in areas north of the Arctic Circle (hence Norway's description as the “Land of the Midnight Sun” and the rest of the country experiences up to 20 hours of daylight per day.

మిడ్ నైట్ నెస్ దేశాలంటే..? రాత్రి ఎరుగని ప్రాంతాలున్నాయని తెలుసా..?

Posted: 05/22/2018 03:56 PM IST
Which countries are known as the land of the midnight sun

పగలు, రాత్రి అనే రెండు కలిస్తేనే 24 గంటలు.. అంటే ఒక రోజు. పగటి పూట సూర్యకాంతి, రాత్రి వేళ చంద్రుడి వెన్నెలను మనం అస్వాదిస్తున్నాం. అయితే రాత్రి అన్నది ఎరుగని ప్రాంతాలు వున్నాయంటే నమ్ముతారా.? మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్న పాఠాల్లో చెట్లు పగటి పూట కార్బన్ డైఅక్సైడ్ ను పీల్చుకుని రాత్రి పూట అక్సిజెన్ ను వెలువరిస్తాయని.. మరి రాత్రే లేని ప్రాంతాల్లో అక్సిజన్ వుండదా.? అసలు అక్కడి ప్రజలు ఎప్పుడు, ఎలా పడుకుంటారు.? ఎప్పుడు విధులకు వెళ్తారు. అన్న సందేహాలు మీ మదిని తొలుస్తున్నాయి కూదూ.

నిజమే మిడ్ నైట్ నెస్ దేశాలు వున్నాయి. అంటే రాత్రే వుండని దేశాలు. వున్నా అది కేవలం కొద్ది సమయం మాత్రమే. మిడ్ నైట్ నెస్ దేశాలు అంటే ఏయే దేశాలు అని సందేహం కూడా వస్తుంది కదూ. నార్వేతో పాటుగా అమెరికాలోని అలాస్కా, ఉత్తర కెనడా, గ్రీన్‌ల్యాండ్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాల్లోనూ ఉంటాడట. అందుకే వీటిని మిడ్‌నైట్‌ సన్‌ కంట్రీస్‌ అంటారు. ఈ దేశాలు ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నాయి కాబట్టే. అవును ధ్రువాల దగ్గర మాత్రమే ఇలా సూర్యుడు రాత్రుళ్లూ కనిపిస్తాడు.

అయితే ఇలా ఎల్లకాలం వుండదు.. కేవలం ఆరు మాసాల పరిమిత కాలంలోనే ఈ పరిణామం వుంటుంది. భూమికి రెండు చివరల్లో పైనా కిందా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయిగా. ఉత్తర ధ్రువం చుట్టూ ఉండేది ఆర్కిటిక్‌ ప్రాంతం. దక్షిణ ధ్రువం చుట్టూ అంటార్కిటికా ఉంటుంది. అర్టిక్ దేశాలకు వేసటి కాలం వస్తే అంటార్టిక్ దేశాలకు శీతల కాలం, అలాగే అంటార్టిక్ దేశాలకు వేసవి కాలం వస్తే అర్టిక్ దేశాలకు శీతల కాలం ఏర్పడుతుంది.

ఏడాదిలో ఆరునెలలు ఉత్తర ధ్రువం సూర్యునికి దగ్గరగా ఉంటుంది. అప్పుడు ఈ ప్రాంతంలో ఎండాకాలం. అదే సమయంలో దక్షిణ ధ్రువం సూర్యునికి దూరంగా ఉంటుంది. అప్పుడు దక్షిణ ధ్రువంలో శీతకాలం. భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు కొద్దిగా వంగడం వల్లే ఈ రుతువులు ఏర్పడతాయి. అలా ఈ ధ్రువాల్లో ఎండాకాలం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని రోజుల పాటు ఈ మిడ్‌ నైట్‌ సన్‌ వింత ఉంటుంది అయితే ఇక్కడి వారు టైం చూసుకునే అన్ని పనులు చేసుకుంటారు. ఉద్యోగాలకు వెళ్లినా, షాపింగ్ కు వెళ్లినా.. అన్ని టైం ప్రకారమే.

అయితే ఇక్కడ మరో అనుమానాం కూడా రేకెత్తక మానదు. కేవలం మూడు మాసాల వేసవి కాలంలో ఎండ వేడమికి తట్టుకోలేక అల్లల్లాడిపోతాం.. మరీ అక్కడ ఏకంగా ఆరు మాసాల పాటు వేసవి కాలం అంటే అక్కడి ప్రజలు ఎంతలా మండిపోతారో అన్న.. అందులోనూ రాత్రిళ్లు కూడా సూర్యడు వుంటాడంటే అసలు ఆ వేడిమికి నిద్ర పడుతుందా.? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి కదూ. కానీ భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇక్కడి ఎండ వెన్నెల్లా చల్లగా ఉంటుంది.

ఎందుకో తెలుసా? ఇక్కడ సూర్యకిరణాలు ఎక్కువ దూరం వాతావరణంలో ప్రయాణం చేసేసి మొత్తం వేడిని కోల్పోతాయి. దీంతో కిందికి వచ్చేసరికి ఆ సూర్యకిరణాల వేడి ఉండదు. ఎండాకాలంలోనూ ఇక్కడ మరి ఎక్కువగా అంటే... ఉత్తర ధ్రువం దగ్గర 27 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుతుందంతే. అదే మొత్తం మంచు ఆవరించి ఉన్న దక్షిణ ధ్రువం దగ్గరయితే మంచు కరిగే పరిస్థితి కూడా ఉండదట. రాత్రుల్లో పండు వెన్నెలను తలపించే సూర్యకాంతితో తిరుగుతుంటే ఆ మజానే వేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : midnightness countries  midnight sun places  norway  ice land  sweden  artic region  antartic regiona  

Other Articles

Today on Telugu Wishesh