what is the secret behind namaskar నమస్కారం ఎందుకని భారతీయ సంస్కార ప్రత్యేకం.?

What is the secret behind namaskar

namaskar, namaskar means, namaskaram, hindu saampradaaya, indian namaskar secret, secret behind indian namaskar, namaste literally mean, namaskar, best namaskar photos, namaskar images, namaskar pictures

The definition of namaskar is to pay obeisance and it is derived from Sanskrit. The real meaning is to recognize the soul or God in the other person.

నమస్కారం ఎందుకని భారతీయ సంస్కార ప్రత్యేకం.?

Posted: 01/22/2018 07:23 PM IST
What is the secret behind namaskar

మన శాస్త్రాలు పెద్దలకు, దేవుడికి ఎలా నమస్కరించాలనే విషయాలన్ని పేర్కొన్నాయి. పెద్దలు, గురువులు, ఇలా ఎవరు తారాసపడినా వారికి నమస్కారం పెట్టడం మన సంప్రదాయంగా మారింది. అసలు నమస్కారమంటే ఏమిటి.. ఎందుకు పెడుతున్నామన్న విషయాలు మాత్రం కేవలం అత్యంత తక్కువ మందికి మాత్రమే తెలుసు. కొందరు యోగా గురువులు మాత్రం నమస్కారమన్నది కూడా యోగాలో భాగమని ఇప్పటికే సెలవిచ్చారు. కానీ అసలు నమస్కారం వల్ల మనిషి తెలుసుకోవాల్సిందేమిటీ..?.

మనిషి జీవన శైలి రోజుకో కొత్త పుంత తుక్కుతున్నా, నేటికీ కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, శుభకార్యాలు నిర్వహించేటప్పుడు, పండుగలని జరుపుకునేటప్పుడు , పూర్తి స్థాయి లో కాకపోయినా, చాల వరకు మన సంప్రదాయాలని తప్పక అనుసరిస్తాం . ఇందులో ముఖ్యమైనది ఆ భగవత్ స్వరూపానికి నమస్కరించడం . ఈ 'నమస్కరించే' ఆచారం గురించి మరింతగా అన్వేషిస్తే.. చేతులు జోడించి చేసే నమస్కారం వెనుక అంతర్యమేమిటంటే.. చేతులు జోడించడం ద్వారా ఎదుటి మనిషిలో దేవుణ్ణ్ని చూడటం అన్నది శాస్త్రాలు తెలుపుతున్న సత్యం.

మన సంస్కృతిలో నమస్కారానికి ఇంత అంతరార్ధం ఉంది. మన భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఎంతో విశిష్టత ఉంది. అసలు మన సంస్కృతిలో నమస్కారానికి ఎంతో ప్రాధాన్యత కూడా దాగి వుంది.  నమస్కార ప్రక్రియ మనలోని వినయ భావాన్ని వ్యక్తీకరించడానికి ఏర్పడింది. సంస్కృతంలో 'నమస్' అంటే 'వినయం, భక్తి, మర్యాద, గౌరవ సూచకాన్ని నమస్కారం ప్రతిభింభిస్తుంది. నమస్కారాన్ని ప్రణామం అని కూడా సంబోధిస్తాం. 'తే' అంటే 'ఎదుటివారికి లేక మీకు' అని అర్థం. నమ: అంటే నా మనస్సు నుంచి అని అర్థం.. లేదా.. భక్తి పూర్వకమని అర్థం. 'నమస్తే' అంటే, 'మీకు భక్తితో కూడిన ప్రణామం' అని అర్థం. అందుకే పెద్దలను చూసినపుడు గౌరవ భావంతో నమస్కరిస్తుంటాం.

తప్పులు చేసినా లేక ఏదేని కోరుకునేందుకు భగవంతుడి ఎదుట నిల్చున్నా.. ఆలయానికి వెళ్లినా.. లేక తీర్థయాత్రలకు వెళ్లాల్సి వచ్చినా.. దేవుడికి ఎదురుగా వెళ్లి మోకరిల్లి నమస్కరిస్తాం. ఎవరైనా ఏదైనా తప్పు చేసినపుడు అతనితో 'పాప పరిహారార్ధం దేవుని ముందు ప్రణమిల్లమ'ని చెబుతాం. అసలు దేవుడి ఎదుట ప్రణమిల్లడం అంటే ఏమిటీ..? దేవుడికి ఎలా నమస్కారం చేయాలి. పెద్దలకు ఎలా నమస్కారం చేయాలి. ఈ రెండింటికీ వున్న వత్యాసమేమిటీ..? ఇక పురుషులు ఎలా నమస్కరం చేయాలి.. స్త్రీలు ఎలా నమస్కారం చేయాలి.? వీరిలోనూ వత్యాసాలు వున్నాయా..? అంటే వున్నాయని చెబుతున్నాయి శాస్త్రాలు.

కాలక్రమేనా వచ్చిన మార్పులతో హస్తం చూపించి నమస్తే అని చెబుతున్న పలకరింపులు చూస్తున్నాం. ఏ ఇద్దరు కలసినా అన్నా నమస్తే అంటూ చేతులెత్తి హస్తం చూపించి కరాచలనాలతో సరిపుచ్చుతున్నారు. కానీ అసలు నమస్కారం ఏలా అచరించాలి..? అంటే రెండు చేతులు జోడించి.. తల వంచి ప్రణమిల్లడమే నమస్కారం. ఇక ఈ తరహ యువతకు నమస్కారం అంటే కూడా తెలియకుండా పోతుంది. పాశ్చాత సంస్కృతి మోజులో పడిన యువత.. పెద్దలు, గురువులు కనబడినా తారతమ్యబేధాలు మర్చి హాయ్, హలో అంటూ పలకరింపులు వినబడుతున్నాయి.

ఈ సందర్భంగా కొంతమందికి అసలు నమస్కారాన్ని ఎలా చేయాలన్న సందేహం కలుగుతుంటుంది. ప్రతి మతంలో నమస్కారం పెట్టేందుకు కొన్ని నియమాలు ఉద్దేశించబడ్డాయి. అయితే కొందరు 'సెల్యూట్' పెట్టినట్లుగా నమస్కరిస్తుంటారు. మరికొంతమంది రెండు చెంపలను వాయించుకుంటూ నమస్కరిస్తుంటారు. ఇంకొందరు రెండు అరచేతులను జోడించి నమస్కరిస్తుంటారు. కొన్ని ప్రాంతాలలోని ప్రజలు ముందుగా చేతులతో భూమిని తాకి, తర్వాత తలను నేలకు ఆనించి నమస్కరిస్తుంటారు.

సాధారణంగా మన సంప్రదాయాల్లో సాష్టాంగ మనస్కారం, పంచాంగ నమస్కారాలను చూస్తుంటాం. పంచాంగ నమస్కారంలో మన శరీరంలోని ఐదు భాగాలు భూమిని తాకుతాయి. స-అష్టాంగ - అంటే శిరస్సు, మొండెము, రెండు భుజాలు, రెండు కాళ్ళు, రెండు చేతులను నేలకు ఆనించి నమస్కరించే పధ్ధతి. స్త్రీలకు మాత్రం పంచ - అంగ నమస్కారం ఉద్దేశించబడింది. స్త్రీలు రెండు భుజములు, మొండెము వదిలి మిగతా అయిదు అవయవములతో (శిరస్సు, రెండు కాళ్ళు, రెండు చేతులు) నేలను తాకుతూ నమస్కరించాలి. స్త్రీలకు మాత్రమే ఎందుకు ఇలాంటి నియమం అని ప్రశ్నించుకున్నప్పుడు, దీనివెనుక హిందూ ధర్మం స్త్రీ మూర్తికిచ్చిన గౌరవమర్యాదలే. ఇందుకు సంతోషం కలుగుతుంది. మొత్తానికి స్త్రీలకు పంచాంగ నమస్కారం ఉద్దేశించబడింది. మాతృత్వానికి మన సంప్రదాయంలో అంతటి మర్యాద.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : namaskar  namaste  indian culture  Hindi culture  secrecy  

Other Articles