Prayag gave three prime ministers to nation ప్రయాగ.. పవిత్ర సంగమమే కాదు త్రిప్రధానుల అందించన ప్రాంతం.

Prayag the holy sangam city which also gave three prime ministers to nation

Allahabad history, Prayag history, Allahabad history, prayag holy place, prayag hindus, prayag muslims, prayag king akbar, prayag mughul emperor, prayag avad, prayag chalukyas, prayag guptas, prayag british artillary center, allahabad the holy city, prayag the holy city, prayag, allahabad, prime ministers, holy place, jawaharlal nehru, indira gandhi, vp singh

Allahabad or Prayag is a historian's paradise. History lies embedded everywhere, in its fields, forests and settlements.

త్రివేణి సంగమ ప్రయాగ.. జాతికి ముగ్గురు ప్రధానులనందించింది

Posted: 07/06/2017 06:30 PM IST
Prayag the holy sangam city which also gave three prime ministers to nation

ప్రయాగ...అనగా యజ్ఞయాగాలకు యోగ్యమైన ప్రాంతము అని అర్థం. ఇక మరోలా చెప్పాలంటే.. గంగ, యమునా, సరస్వతీ నదుల పుణ్య సంగమ ప్రాంతం..ఈ మూడు నదులు కలిసేన పవిత్ర పుణ్యప్రాంతం. ఇది త్యాగానికి ప్రతీక. పురాణేతిహాసాలలో మార్మోగిన ప్రాంతం. అమృతబిందువు నేలరాలిన చోటు. వేలాది సంవత్సరాల యాగఫలాన్నిచ్చే పవిత్రనగరం. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో ప్రయాగ తన పవిత్ర నామాన్ని కోల్పోయి ఇలాహాబాదుగా మారింది. ఇలాహ్ అంటే దేవుడు.. అబాద్ అంటే అవాసము.. దేవుడి అవాసంగా పేరుమార్చుకున్నా.. హైందవ యజ్ఞయాగాలకు నెలవైన, పవిత్ర ప్రాంతం.

పరమ పవిత్రమైన త్రివేణి సంగమం(గంగ, సరస్వతి, యమున) నదులు కలిసే చోటు ఇక్కడే ఉంది. ఈ పవిత్ర స్థలంలో 144 ఏళ్ల తరువాత ఐదేళ్ల కిందట కుంభమేళా నిర్వహించారు. ఈ సమయంలో కుంభమేళ అరంభానికి ముందుగానే లక్షలాది మంది భక్తులు ఈ పవిత్రస్థాలానికి చేరుకుంటారు. అందాలకు, ఆనందానికి ఇక్కడ కొదవ లేదు. విహరించే పక్షులు...పడవ లపై నదీ ప్రయాణం... ఉల్లాసాన్ని పంచే అక్బర్‌ కోట, ఆధ్యాత్మితను ప్రతిబింబించే ఆలయాలు చూస్తే చరిత్ర ఘనకీర్తిని అస్వాధించలేము.

ధ్యాత్మికతతో పాటు ప్రయాగ నగరం చారిత్రక విశేషాలను కూడా కలిగి ఉండడం విశేషం. మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ నిర్మించిన కోట, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు నివాస గృహం ‘ఆనంద్‌ భవన్‌’కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. రామాయణ కాలం నాటి భరద్వాజ మహామునికి చెందిన ఆశ్రమంగా చెప్పే చోటనే అలహాబాద్‌ విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది. దీంతో సంవత్సరం పొడవునా ఈ నగరాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉంటారు.

శివుని జటాజూటం నుంచి వెలువడ్డ గంగమ్మ ఓ ప్రక్క స్వచ్ఛంగా.. తెల్లగా ... చలాకీగా సాగుతూ ఉంటుంది ... కిష్టయ్యను సేవించడంతో నల్లబడ్డదా అన్నట్టు నల్లని యమున గంగను జేర సంకోచంగా వస్తున్నట్టు రెండవ ప్రక్కనుంచి మెలమెల్లగా వస్తుంది. తెల్లటి శివయ్యా.. నల్లటి కిష్టయ్య.. తెల్లటి గంగమ్మ .. నల్లటి యమునమ్మ.. ఆ దశ్యం నయన మనోహరంగా ఉంటుంది. అంతర్వాహిని సరస్వతి కాళ్లకు చల్లగా తగులుతుంది... ఆ త్రివేణి సంగమం భరతభూమికి క్షేత్రమాహత్మ్యం కల్పిస్తున్నది.. కనపడే రెండు నదులు, కనపడనిది ఒకటి... ఆ నదుల త్రివేణీ సంగమం కళ్లను మైమరపిస్తుంది.

ఇక్కడ కురులు సంగమంలో వదిలితే నీటిపై తేలకుండా క్రిందకు పోవడం అక్కడ విశేషం... శంకరమఠం.. తర్వాత లలితాదేవి ఆలయం ఉంది. లలితాదేవీ ఆలయం అష్టాధశ శక్తిఫీఠాలలో ఒకటి. శక్తిపీఠాల్లో చెయ్యి పడిన ప్రదేశం.. ఒక నూతిలో పడినదట.. గర్భగుడిలో నూయి.. దానికి పూజాదికములు నిర్వహిస్తారు. మహిరావణుని చంపి రామలక్ష్మణుల తన భుజాలపై తెచ్చిన హనుమ సుందర రూపం.. పడుకున్న భంగిమలో ఉంటుంది, అలహాబాద్‌ మ్యూజియం, యమున సస్పెషన్‌ బ్రిడ్జీ, నాగవాసుకీ ఆలయం ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాల సమాహారమే ప్రయాగ..

శైవ పుణ్యక్షేత్రమైన వారణానికి 135 కిలోమీటర్ల దూరంలోనే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రయాగ ఉంది. మన దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైల్వే సదుపాయాలు ఉన్నాయి. వారణాసి నుంచి వెళ్లాలనుకునే వారి కోసం బస్సు సౌకర్యం కూడా ఉంది. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కిన కాశి నుంచి నాలుగు గంటలు ప్రయాణం చేస్తే అలహాబాద్‌ చేరుకోవచ్చు. అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి నదీ సంగమం చాలా దగ్గర్లోనే ఉంటుంది.

1526లో అలహాబాద్‌ను మొగల్‌ చక్రవర్తులు పరిపాలించేవారు. మొగల్‌ చక్రవర్తుల్లో ముఖ్యుడైన అక్బర్‌ చక్రవర్తి ఇక్కడ శుత్రుదుర్భేధ్యమైన కోటను నిర్మించాడు. ఓ పక్క నది ప్రవహిస్తూ తీరంలో నిలబడి కోట చూస్తే నాటి చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. అక్బర్‌ చక్రవర్తి కాలంలో ఈ నగరాన్ని ‘అల్లహ్‌నాస్‌’ అని మార్చాడని క్రమేపీ అది అలహాబాద్‌గా మారిందని అబు ఫజల్‌ రాశాడు. 1765లో బ్రిటీష్‌ వారు ఈ కోటలో సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు. 1857 తరువాత భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అలహాబాద్‌ కీలక పాత్ర పోషించింది.

స్వాతంత్ర్యసమరంలో అంగ్లేయుల పాలనను ధిక్కరించిన అనేక మంది దేశభక్తులు వందేమాతరమే పాటగా, శ్వాసగా, అశగా జైలు పాలయ్యారు. ప్రధాన సమావేశాలకు ఆనంద్‌ భవన్‌, స్వరాజ్‌ భవన్‌లు వేదికగా మారింది. 1931లో ఆప్ప్రైడ్‌ పార్కు వద్ద బ్రిటీష్‌ దళాలు చుట్టుముట్టడంతో భారత స్వాతంత్య్ర విప్లవ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ తనను తాను కాల్చుకుని మరణించాడు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా ఈ పవిత్ర స్థలం తన అధిపత్యాన్ని కొనసాగింది. దేశ రాజకీయంలోనూ తన అదిక్యాన్ని చాటుకుంది.

రాజకీయంగా అలహాబాద్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. దేశ ప్రధానులను ఎక్కువమందిని అందించిన నగరంగా దీనికి ప్రత్యేకత ఉంది. 13మంది ప్రధానుల్లో ఏడుగురు ఇక్కడివారే. అలహాబాద్‌లో పుట్టడమో, అలహాబాద్‌ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేయడమో లేదా ఇక్కడి నుంచి ఎన్నికవడం ద్వారా ప్రధానులైనవారిలో జవహర్‌లాల్‌నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్ర్తి, ఇందిరాగాంధీ, గుల్జారీలాల్‌నందా, రాజీవ్‌గాంధీ, చంద్రశేఖర్‌, విపిసింగ్‌ ఉన్నారు. భారత ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రు, ఇందీరాగాంధీ, వి.పి.సింగ్‌ కూడా ఇక్కడే జన్మించారు. ఇక కాలగమనంలో అలహాబాద్ విశ్వవిద్యాలయంగా మారిన రామాయణ కాలంనాటి భరద్వాజ మహాముని అశ్రమంలో చదవుకున్న చంద్రశేఖర్ కూడా ప్రధాని అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prayag  allahabad  prime ministers  holy place  jawaharlal nehru  indira gandhi  vp singh  

Other Articles