The Beauty of Shanghai in china

The beauty of shanghai in china

China, ShaanghaiShaanghai Tourism, Shaanghai images, beauty of Shaanghai, Shaanghai in China, Shaanghai to Visit

Enormous Shanghai, on China’s central coast, is the country's biggest city and a global financial hub. Its heart is the Bund, a famed waterfront promenade lined with colonial-era buildings. Across the Huangpu River rises Pudong’s futuristic skyline, including 632m Shanghai Tower and the Oriental Pearl TV Tower, with distinctive pink spheres. Sprawling Yuyuan Garden has traditional pavilions, towers and ponds.

చైనాలోని షాంఘై సొగసు చూడతరమా...!

Posted: 12/03/2015 01:34 PM IST
The beauty of shanghai in china

అందాల లోకంలో విహరించాలని ఎవరి మాత్రం ఉండదు. చాలా మందికి కుదరక.. చాలా మందికి వివరాలు తెలియక అందాలను ఆస్వాదించలేకపోతున్నారు. అయితే మన పక్కనే ఉన్న చైనా గురించి అందరికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ది, జనాభా ఒక్కటే కాదు పర్యాటకంగా చైనా ఎంతో బాగుంటుంది. చైనాలో రాజధాని బీజింగ్‌తో పాటు, హాంగ్‌కాంగ్‌ వంటి అనేక పర్యాటక దిగ్గజ నగరాలున్నాయి. వీటిలో వేటికవే ప్రత్యేకతను సంపాదించుకున్నాయి.  పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద టూరిస్ట్‌ సిటీ షాంఘై కూడా పై నగరాలేకమాత్రం తీసిపోకుండా... ఏటేటా పర్యాటకుల సంఖ్యను పెంచుకుంటోంది. చైనా తూర్పుభాగంలో యాంగ్జీ నదీతీరంలో అందంగా అమరిన షాంఘై నగర విశేషాలు...

పురాతన గార్డెన్‌... యుయుయాన్‌:
1577లో మింగ్‌ డైనాస్టీ రాజులు ఆరంభించిన ఈ గార్డెన్‌ 500 ఏళ్ళకి పైబడినది. సెప్టెంబర్‌ 1961 నుంచి ఈ గార్డెన్‌లోకి ప్రజలని అనుమతిస్తున్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ గార్డెన్‌లో పవిలియన్స్‌, హాల్స్‌, సరస్సులు, అందమైన దృశ్యాలు గల ఆరు ప్రదేశాలు, 50 అడుగుల ఎత్తుగల రాతి శిల్పాలు మొదలైనవి చూడదగ్గవి. 400 ఏళ్ళకి పైబడ్డ, 70 అడుగుల ఎత్తుగల రెండు వృక్షాలని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ అందరూ సందర్శించదగ్గ విశేషం జేడ్‌ రాక్‌. దాదాపు పదకొండు అడుగుల ఎత్తుగల దీనికి 72 రంధ్రాలు ఉన్నాయి. దాని కింద అగరుబత్తిని వెలిగిస్తే, ఆ పొగ అన్ని రంధ్రాలలోంచి బయటకి వచ్చి చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే పైనుంచి ఈ రాతి మీదికి నీరు పోస్తే, ఆ రంధ్రాలలోంచి ఆ నీరు బయటకి వచ్చి కనువిందు చేస్తుంది.

ప్రాచీన వస్తు సముదాయం... షాంఘై మ్యూజియం:
పీపుల్స్‌ స్కే్వర్‌లోగల ఈ మ్యూజియంలో చైనా ప్రాచీన కళావస్తువులని చూడవచ్చు. ఏడు గాలరీలు, మూడు ఎగ్జిబిషన్‌ హాల్స్‌ గల ఈ మ్యూజియంలో ప్రాచీన బ్రాంజ్‌, పింగాణీ, జేడ్‌ వస్తువులు, పెయింటింగ్స్‌, కేలిగ్రఫీ (అందమైన చేతి రాత) శిల్పాలు, మింగ్‌ క్వింగ్‌ రాజుల ఫర్నిచర్‌, రాజముద్రికలు మొదలైనవి చూడవచ్చు. ఏడు వేల రకాల చైనీస్‌ నాణేలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఎక్కువగా బుద్ధుడికి సంబంధించిన శిల్పాలు ఉంటాయి. రోజులో మొదటి 1500 మందికి, ఇంకా 70 ఏళ్ళు పైబడ్డ వారికి ప్రవేశం ఉచితం. ఈ మ్యూజియం చూడడానికి సుమారు గంటన్నర సమయం పడుతుంది.

చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరం షాంఘై. ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్‌ ప్రాంతాలలో ఒకటి. జనాభా 2 కోట్ల పైనే. చైనాలోని మధ్య - తూర్పు తీరంలో యాంగ్జీ నది ముఖప్రదేశం వద్ద అందంగా అమరిన నగరం. ప్రాథమికంగా మత్స్యపరిశ్రమ, టెక్స్‌టైల్‌ రంగాలతో ప్రస్థానాన్ని ప్రారంభించింది షాంఘై. ఇక్కడి ఓడరేవు కారణంగా 19వ శతాబ్దంలోనే ప్రధాన నగరంగా, ప్రపంచ వాణిజ్యకేంద్రంగా మారింది. దూర - తూర్పు దేశాలు, పశ్చిమ దేశాల మధ్య ఈ నగరం ప్రముఖ వాణిజ్య - వర్తక కేంద్రంగా, విత్తకేంద్రంగా 1930 నుండి తన పాత్రను పోషిస్తున్నది. 1949 చైనా అంతర్యుద్ధం సమయాన షాంఘై ఒడుగుదిడుగులను ఎదుర్కొన్నది. 2005లో షాంఘై రేవు, ప్రపంచంలోని రద్దీగల ఓడరేవుగా మారింది. ఈ ప్రాధాన్యాలు షాంఘై పట్టణాన్ని రానురాను ప్రపంచ పర్యాటక దిగ్గజ నగరాల్లో ఒకటిగా చేశాయి. షాంఘైలో పర్యాటక అందాలు చూడాలంటే ఒకట్రెండు రోజులు ఏమాత్రం సరిపోవు. అంతలా పర్యాటక ఆకర్షణలు ఎన్నో ఉన్నాయిక్కడ.

ప్రేమపక్షుల అడ్డా... ది బండ్ :
దీన్ని హాంగ్‌షాన్‌ డోంగ్‌వైలు అని స్థానికులు పిలుస్తారు. మన టాంక్‌బండ్‌లా హువాంగ్‌ హూ నదికి పశ్చిమ భాగాన గల ఈ బండ్‌ 1500 మీటర్ల పొడవు ఉంటుంది. అక్కడ ఉన్న 26 భవంతులు గోధిక్‌, బరోక్కూ, రోమనెస్క్యూ, క్లాసిజం, రినయసెన్స్‌ ఆర్కిటెక్చర్‌కి చెందిన భవంతులు. గత శతాబ్దంగా ఇక్కడ ఉన్న ఫ్లడ్‌ కంట్రోల్‌ వాల్‌ని ది లవర్స్‌ వాల్‌గా పిలుస్తున్నారు. అక్కడి రొమాంటిక్‌ వాతావరణంలో ప్రేమికులు కలుసుకుంటూంటారు. ఈ బండ్‌ దగ్గర యాత్రికులు అధికంగా ఫొటోలు తీసుకుంటారు. ఒకప్పుడు బురద నీటితో అసహ్యంగా ఉండే ఈ ప్రాంతాన్ని బ్రిటిషర్స్‌ అభివృద్ధిచేసారు. ఇక్కడ అనేక విగ్రహాలని కూడా ప్రతిష్టించారు. రాత్రిళ్ళు దీపాలతో ఇది అద్భుతంగా ఉంటుంది.

నాన్‌జింగ్‌ రోడ్ :
దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు బండ్‌కి తూర్పున మొదలై పశ్చిమంలో అంతమవుతుంది. ఇది షాపింగ్‌ సెంటర్‌. అన్ని రకాల వస్తువులనీ కొనడానికి టూరిస్టులు ఇక్కడికి అధికంగా వస్తూంటారు. కేఎఫ్సీ, మెక్‌డొనాల్డ్‌, పిజ్జాహట్‌ మొదలైన ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌ చైన్‌లు, అంతర్జాతీయ బ్రాండెడ్‌ వస్తువుల దుకాణాలు కూడా ఇక్కడ చూడచ్చు.

జేడ్గ బుద్ధ టెంపుల్‌ :
1882జేడ్గ బుద్ధ టెంపుల్‌ లో బర్మా నుంచి తెచ్చిన జేడ్‌ బుద్ధుడి విగ్రహ ఆలయం ఇది. బుద్ధుడి విగ్రహాలు రెండు గల ఈ ఆలయంలో ఒక బుద్ధుడు తల కింద చేతిని ఉంచుకుని పడుకుని ఉంటాడు. ప్రవేశ రుసుం 30 యెన్‌లు.

ఓరియంటల్‌ పెర్ల్‌ టీవీ టవర్‌ :
1531 అడుగుల ఎత్తుగల ఈ టీవీ, రేడియో టవర్‌ ప్రపంచంలోని మూడవ ఎత్తయిన టవర్‌ (మొదటిది టొరొంటో (కెనడా) కాగా, రెండవది మాస్కో (రష్యా). ఏటవాలుగా పాతిన ఏడు మీటర్ల ఎత్తుగల మూడు స్థంభాలమీద నిలబడ్డ ఈ టవర్‌ని వేలకొద్ది పర్యాటకులు నిత్యం సందిర్శస్తూంటారు. డబుల్‌ డెక్కర్‌ లిఫ్ట్‌లలో సందర్శకులు పావు మైలు ఎత్తులో ఉన్న దీని మీదికి చేరుకుని 360 డిగ్రీల కోణంలో షాంఘై నగరాన్ని వీక్షిస్తారు. షాంఘై మున్సిపల్‌ హిస్టరీ మ్యూజియం కూడా ఇక్కడ ఉంది.

జిన్‌టియన్‌డి :
ఇది పాదచారులు నడిచే సన్నటి రోడ్డు. ఇక్కడ ప్రాచీన భవంతులని, ఆధునిక భవంతులని ఒకేచోట చూడచ్చు. కొన్ని ప్రాంతాలలో 1920ల నాటి షాంఘైని యథాతథంగా చూడవచ్చు. అనేక సావనీర్‌ షాపులు, రెస్టారెంట్స్‌ కూడా ఈ దారిలో ఉన్నాయి. పేవ్‌మెంట్‌ మీద కుర్చీలు వేసిన రెస్టారెంట్స్‌ ఇక్కడి ప్రత్యేకత. నిన్న, రేపు ఇవాళ కలిసేచోటు ఇది అన్నది దాని నినాదం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles