The Special Story Of Kinnaur Hill Station Which Is Called As The Land Of Fairy Tales | Himchal Pradesh Destinations

Kinnaur hill station special story the land of fairy tales himachal pradesh destinations

kinnaur hill station, kinnaur district, kinnaur hill station destinations, himachal pradesh destinations, india tourist places, india best destinations, himachal pradesh beauty places, kinnaur tourist spots

Kinnaur Hill Station Special Story The Land Of Fairy Tales Himachal Pradesh Destinations : The Special Story Of Kinnaur Hill Station Which Is Called As The Land Of Fairy Tales. This Is Famous As Best Destination In India.

‘ది ల్యాండ్ ఆఫ్ ఫేరీ టేల్స్’గా పిలువబడే కిన్నౌర్

Posted: 09/02/2015 07:30 PM IST
Kinnaur hill station special story the land of fairy tales himachal pradesh destinations

దేశంలో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాల్లో కిన్నౌర్ హిల్ స్టేషన్ ఒకటి. చూడముచ్చటగా, ఎంతో అందంగా కనువిందు చేసే ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పట్టుకుచ్చులాంటి ఆకుపచ్చని లోయలు, పంటకు వచ్చిన పండ్ల తోటలు, అందమైన ద్రాక్ష తోటలు తదితరాలు ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికే వన్నె తెచ్చాయి. ఇన్ని సౌందర్యాలను ఇనుమడింపజేసుకోవడంతో దీనిని ‘ది ల్యాండ్ ఆఫ్ ఫేరీ టేల్స్’ అని కూడా పిలుస్తారు. దేశంలో వున్న ఇతర సౌందర్య ప్రదేశాలకు, ఈ కిన్నౌర్ లో దాగివున్న అందమైన ప్రాంతానికి మధ్య ఎంతో వ్యత్యాసం వుంటుంది. అలాగే.. అక్కడి సంస్కృతికి మిగతా రాష్ట్ర సంస్కృతికి తేడా గమనించవొచ్చు. పర్యాటకులు ఇక్కడ బ్రహ్మాండమైన కిన్నౌర్ కైలాష్ పర్వతాన్ని కూడా చూడవొచ్చు. అంతేకాదు.. ఇక్కడ మరిన్ని ఆకర్షణీయమైన ప్రదేశాలు వున్నాయి. అవేమిటో చూద్దాం..

* నాకో సరస్సు : ఇది కిన్నౌర్ లోని ఒక చిన్న కుగ్రామమైన ‘నాకో’లో వుంది. ఈ సరస్సు సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ నాలుగు అందమైన దేవాలయాలు, అనేక చెట్లతో వుంటాయి. ఇక్కడ ఓ పాదంలాంటి గుర్తు వుంది. జానపద కథనం ప్రకారం.. అది న్యింగ్మ పాఠశాల వారిచే రెండవ బుద్ధుడిగా పిలువబడ్డ ‘గురు పద్మసంభవ’ పాదముద్ర అని అంటారు.

kinnaur-hill-station-01
kinnaur-hill-station-02
kinnaur-hill-station-03
kinnaur-hill-station-04
kinnaur-hill-station-05
kinnaur-hill-station-06
kinnaur-hill-station-07
kinnaur-hill-station-08

* హన్గ్రాంగ్ లోయ : ఇది ఈ ప్రాంతంలో వుండే రెండవ పెద్ద లోయ. ఇది టిబెట్, స్పితి సరిహద్దులుగా వున్న కిన్నౌర్ బోర్డర్ లో వుంది. ఈ భూభాగమంతా రాతి, బంజరు భూమి అయి వుండటం వల్ల ఇక్కడ వృక్షసంపద ఏమీలేదు. ఈ భూభాగమంతా కొండ ప్రాంతంగా ఉండటంవలన ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చాలా క్లిష్టమైన పని. ఆఖరికి పర్వతారోహణ నిపుణులు కూడా ఈ ప్రాంతంలో అధిరోహించలేరు. అయినప్పటికీ, ఈ లోయలో పర్వతారోహణ, పక్షుల పరిశోధన వంటి ఇతర సాహసోపేత చర్యలకు ప్రసిద్ధిచెందింది.

* చరంగ్ ఘటి : ఈ ప్రదేశం ‘సాంగ్ల వాలి’లో వుంది. దీని ఎత్తు 5242 మీ. దీనిని 1994వ సంవత్సరంలో పర్యాటకుల సందర్శనార్ధం ప్రారంభించారు. అప్పటినుండి ఈ ప్రాంతం ట్రెక్కింగ్ స్థలంగా, ‘చరంగ్ ఘటి పాస్’ గా పేరుగాంచింది. అధిరోహణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు ఈ ప్రాంతం సహజ అందాన్ని, అక్కడ ఉన్న స్థానిక దేవాలయాల అందాన్ని చూసి సంతోషిస్తుంటారు.

కేవలం ఇవి మాత్రమే కాదు.. కిన్నౌర్ లో సందర్శించడానికి ఎన్నో అభివృద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, ట్రెక్కింగ్ ప్రాంతాలు, పార్కులు, ఇంకా చాలా వున్నాయి. ఇక్కడికి పర్యటించడానికి వచ్చే ప్రతిఒక్కరు సంతోషంగా తమ కాలాన్ని గడపవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kinnaur hill station  himachal pradesh  india best destinations  

Other Articles