The Mythological Story Behind Talakona WaterFalls | Telugu Historical Stories | Lord Vishnu Histories

Talakona waterfalls historical special story lord vishnu mythological stories

talakona waterfalls, talakona history, talakona mythological story, talakona historical story, talakona temples, talakona shiv temple, nelakona water, talakona forest, shirodronam

Talakona WaterFalls Historical Special Story Lord Vishnu Mythological Stories : The Mythological Story Behind Talakona WaterFalls Where Lord Vishnu Take A Dip On Hill.

దట్టమైన అడవి మధ్యలో అందమైన తలకోన జలపాతం

Posted: 08/25/2015 06:41 PM IST
Talakona waterfalls historical special story lord vishnu mythological stories

దేశంలో వున్న అందమైన ప్రదేశాల్లో తలకోన జలపాతం ఎంతో అపురూపమైంది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అరణ్యప్రాంతం.. మధ్యలో వుండే ఈ జలపాతం ప్రకృతి ప్రతిరూపంగా కనువిందు చేస్తుంది. ఇంతటి రమణీయ ప్రదేశం ఎక్కడుందని ఆలోచిస్తున్నారా..? మరెక్కడో కాదు.. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలోనే వుంది. ఈ ప్రాంతంలో సాక్షాత్తూ ఆదిశేషుడే పర్వతరూపం దాల్చాడని పురాణ గాథ.

పూర్వం.. కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలుస్తూ.. అలసిపోయి ఇక్కడే నిద్రపోయాడని చెబుతారు. అలా పడుకునే సందర్భంలో ఆయన తల భాగం ఇక్కడున్న కొండ (కోన) శిఖరం మీద ఆనించాడని.. అందుకే ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. ఈ జలపాతాన్ని శిరోద్రోణం అని కూడా పిలుస్తారు. ఎంత రమణీయంగా కనువిందు చేసే ఈ జలపాతం.. రాష్ట్రంలోనే ఎత్తయినది పేరుగాంచింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ఈ తలకోన ప్రాంతంలో మరెన్నో అందాలను వున్నాయి.

* తలకోన జలపాతం : కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతాన్ని చూడొచ్చు. ఈ జలపాతానికి చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు వుంటాయి. ఇటువంటి ప్రకృతి మధ్య బంధింపబడి వున్న ఈ జలపాతాన్ని చూసినప్పుడు ఎంతో అపురూపమైన అనుభూతి కలుగుతుంది. జలపాత దృశ్యం చూడ్డానికి చాలా అకర్షణీయంగా వుంటుంది. నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. 60 మీటర్ల ఎత్తునుంచి ఈ జలపాతం జాలువారుతుంది.

talakona-falls-image-01
talakona-falls-image-02
talakona-falls-image-03
talakona-falls-image-04
talakona-falls-image-05
talakona-falls-image-06
talakona-falls-image-07
talakona-falls-image-08
talakona-falls-image-09
talakona-falls-image-10

* శివాలయం : తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే ఓ శివాలయం ఉంది. ఇక్కడి శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని 1811లో అప్పాస్వామి అనే భక్తుడు కట్టించాడని స్థానికులు చెబుతారు. శివుడితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా వున్నాయి.

* నెలకోన : ఆలయానికి అతి సమీపంలోనే దట్టమైన కొండల మధ్య ఓ వాగు ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఎంత ఎత్తునుంచి నీళ్లు జాలువారుతాయో కనిపించవు. ఔషధ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి.

* వృక్ష సంపద : ఈ దట్టమైన అటవీ ప్రాంతం వృక్ష సంపద, వన వూలికలకు పుట్టినిల్లు. ఈ అడవుల్లో వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. సూర్యరశ్మి నేలమీద పడనంత దట్టమైన అడవి కావడంతో చెట్లు సూర్యరశ్మిని అందుకోవడానికి పైకి పైపైకి పెరుగుతాయి. ఎక్కువగా ఎర్రచందనం, జాలారు, వుద్ది లాంటి చెట్లు ఉంటాయి. అడవిలో ప్రధానంగా అడవికోళ్లు, నెమెళ్లు, దేవాంగుపిల్లి, బెట్లుడుత, ఎలుగుబంట్లు, దుప్పులు, కణితులు, ఏనుగులు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talakona waterfalls  telugu mythological stories  nelakona  

Other Articles