bindu sarovar history | Lord Mahavishnu tears | Gujarat

Bindu sarovar history lord mahavishnu mythological story

bindu sarovar lake, bindu sarovar history, bindu sarovar biography, bindu sarovar mythological story, bindu sarovar biography, bindu sarovar wikipedia, lord mahavishnu, lord vishnu temple, lord vishnu history, mythological stories, telugu hindu stories, hindu temples

bindu sarovar history Lord Mahavishnu mythological story : Bindu Sarovar literally means a lake of drops for it is believed that Lord Mahavishnu’s tears have fallen in this lake. There are several small temples along the bank of Bindu Sarovar belonging to Kapila Mahamuni, Sage Kardhama Prajapathi, Devahuti, Gaya Gadhadhara, Lord Shiva and other Hindu deities.

పరమశివుని కృపతో ఏర్పడిన ‘బిందు సరోవరం’ విశేషాలు

Posted: 04/11/2015 07:17 PM IST
Bindu sarovar history lord mahavishnu mythological story

గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ‘బిందు సరోవరం’ ఉంది. ఈ సరోవరం పరమశివుని కృపతో ఏర్పడిందని, కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు.

పురాణ గాథ :

మొదటి కథ : పూర్వం.. స్వాయంభువు మనువు-శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అనే ముగ్గురు కుమార్తెలు వుండేవారు. వీరి ముగ్గురిలో దేవహుతికి వివాహం చేయడం కోసం ఆమెకు తగిన వరుడిని వెతికే ప్రయత్నంలో స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. ఇలా తిరిగితిరిగి చివరకు అతను ఈ ప్రాంతానికి (సిద్ధపూర్) రాగానే అక్కడ కర్దముడు అనే ఓ యువకుడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతోనే ఈ ‘బిందు సరోవరం’ ఏర్పడిందని కథనం.

ఇక కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమముని ఓ విమానాన్ని సృష్టించాడు. దాని ద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లందరికీ పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ వుంటే బాగుంటుందనిపించింది. అప్పుడు అతడు తన భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు. ఆ పుత్రుడే కపిలుడు.

ఇతర విశేషాలు :

ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bindu sarovar lake  lord mahavishnu  telugu mythological stories  

Other Articles