The famous sun god temple situated in arasavalli village sri suryanarayana swamy temple located in arasavalli special story

Sun Miracle at Arasavalli Temple, ancient sun temple, Hindu solar deity Surya, famous temple located near the Srikakulam, Sun rays illuminate Sun God, Sri Suryanarayana Swamy Temple, Arasavalli, Sun Rays focus on the feet of the God

Arasavalli is an ancient sun temple dedicated to the Hindu solar deity Surya, located near the Srikakulam town of Andhra Pradesh, special story

దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన అరసవెల్లి సూర్య దేవాలయం

Posted: 12/16/2014 10:24 AM IST
The famous sun god temple situated in arasavalli village sri suryanarayana swamy temple located in arasavalli special story

పూర్వము శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం మండలంలో ఉన్న గ్రామం. ఇప్పుడు (2008), శ్రీకాకుళం పట్టణానికి కలిపి వేసి మున్సిపాలిటీ లో ఒక వార్డుగా పరిగణించడమైనది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని "హర్షవల్లి" అనేవారని క్రమ క్రమంగా "అరసవిల్లి" అయిందని చెపుతారు.

భారత దేశం లోని అతి కొద్ది సూర్య దేవాలయాల్లో ఈ సూర్య దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రముఖ సూర్య దేవాలయంగా ప్రసిద్ది గాంచిన శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని  శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఒక కిలో మీటర్ దూరం లో ఉన్నది.

ఇక్కడి సూర్యదేవాలయం లో గల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థల పురాణం ద్వార తెలియుచున్నది. ఇక్కడ లభించినశాసనాలు క్రీ.శ. 7 వ శతాబ్థానికి చెందినవి. అందువల్ల ఇది ప్రాచీన దేవాలయం అని చెప్పవచ్చు. భారతదేశం లో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. (ఒరిస్సాలో సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు). ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఙులు పేర్కొన్నారు.

ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది.

ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని ఒక మహత్తరమైన విషయం, సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది. ప్రతి సంవత్సరం మార్చి,అక్టోబర్ లలొ ఇది జరుగుతుంది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles