Africa giant ghana snail achatina achatina which are harmful for crops

giant ghana snails, giant ghana snails photos, giant ghana snail story, giant ghana snail details, giant ghana snail life story, giant ghana snail crops, crops india, achatina achatina

africa giant ghana snail achatina achatina which are harmful for crops

పంటపొలాలను నాశనం చేసే ‘‘ఆఫ్రికా రాక్షస నత్త’’!

Posted: 10/22/2014 04:41 PM IST
Africa giant ghana snail achatina achatina which are harmful for crops

సాధారణంగా ఒకే జాతికి చెందిన జంతువుల్లో కొన్ని రకాలు వుంటాయి. అందులో కొన్ని సాధారణమైనవి వుంటాయి.. మరికొన్ని హాని కలిగించేవి వుంటాయి. అటువంటి వాటిల్లో ఈ ఆఫ్రికా రాక్షస నత్త కూడా ఒకటి! దీన్ని ‘‘జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్’’ అని కూడా అంటారు. నిజానికి ఇవి ఎక్కడో మధ్య ఆప్రికాలో తమ జీవితాన్ని గడుపుతూ వుండేవి. కానీ ఇప్పుడు మాత్రం దేశదేశాలకు ఇవి సంచరిస్తున్నాయి. ఇవి ఎలా వ్యాపించాయో ఇంతవరకు ఏ ఒక్కరు గుర్తించలేకపోయారు. ప్రపంచంలోనే అత్యంత మెల్లగా నడిచే ఈ ప్రాణికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడానికి పక్షుల్లాగా రెక్కలు కూడా కావు.. వేగంగా పరుగెత్తనూలేవు..! అలాంటప్పుడు ఇవి ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించాయంటూ అగ్రదేశాలకు సైతం అంతుచిక్కని ప్రశ్నగానే ఇప్పటికీ మిగిలిపోయింది.

ఇప్పటికే ఈ రాక్షస నత్తలు ఆయా దేశాలకు తలనొప్పిగా మారాయి. చైనా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, భూటాన్ లాంటి ఎన్నో దేవాల్లో వ్యాపించి... అక్కడున్న పంటలను పెద్దమొత్తంలో నాశనం చేస్తున్నాయి. అంతెందుకు.. ఐక్యరాజ్యసమితి కూడా ఈ నత్తను పంటలను నష్టం కలిగించే అత్యంత ప్రమాదకారి ప్రాణిగా పరిగణించిందంటే.. ఇది ఎంతవరకు ముప్పుతిప్పలు పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే.. ఇవి రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తూ.. పంటలను నాశనం చేస్తుంటాయి కాబట్టి వీటిని తరిమికొట్టడం చాలా కష్టతరమౌతోంది. అందుకే.. దీని దెబ్బకు అగ్రదేశాలు కూడా వణికిపోతున్నాయి. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ రాక్షస నత్త ఇప్పుడు భారతదేశంలోని కేరళకు కూడా చేరుకున్నాయి. అక్కడున్న పటలపై దాడిచేస్తూ పెద్దమొత్తంలో నష్టం కలిగిస్తున్నాయి. వీటిని ఎలా అడ్డుకోవాలో తెలీక రైతులు తలమునకలైపోతున్నారు. వీటి ఏరివేతకోసం ప్రభుత్వం కూడా కోటానుకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ.. పెద్ద యుద్ధమే ప్రకటించేసింది.

రాక్షస నత్త వివరాలు :

ఇవి దాదాపు 8 అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. 5 నుంచి 7 ఏళ్ల వరకు వీటి జీవితకాలం. ఇవి నెలలతరబడి దీర్ఘనిద్ర (హైబర్ నేషన్)లో వుండి కేవలం వర్షాకాలంలో మాత్రమే బయటికి వస్తాయి. ఈ నత్త ‘‘హెర్మాప్రోడైట్’! అంటే.. ఒకే జీవిలో ఆడ, మగ లక్షణాలు కలిగి వుంటాయి. అందుకే.. వీటిసంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూనే వుంది. ఇవి ఏ పంటలమీదైనా దాడి చేస్తాయి. నిపుణుల లెక్కప్రకారం ఇవి దాదాపు 500 వృక్షజాతుపలై దాడి చేస్తాయని తేలింది. అందుకే.. పంటలు ఎక్కువగా పండే కేరళపై ఈ నత్తలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. గత ఐదారేళ్లక్రితం కేరళలో అడుగుపెట్టిన ఈ నత్తల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని తెలిసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇవి కేవలం మొక్కలే కాదు, తమ గుల్లను బలంగా చేసుకోవడం కోసం ఇసుక, ఎముకలు, చివరికి సిమెంటు గోడులను కూడా తినేస్తాయట! అందుకే.. దీని పేరు రాక్షస నత్తగా పేర్కోవడం జరిగింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : giant ghana snail  achatina achatina  crops  crops insects  

Other Articles