The secrets behind kedarnath hills

kedarnath news, kedarnath temples, kedarnath hills, chorabari lake, gowri kund kedarnath, kedar masif, mandakini lake kedarnath, shankaracharya comb kedarnath, vasuki lake kedarnath, ganga river, kedarnath temple photos

the secrets behind kedarnath hills which has historical histories and best tourist locations

మంచుకొండల్లో దాగివున్న మహారహస్యాలు!

Posted: 09/16/2014 01:41 PM IST
The secrets behind kedarnath hills

(Image source from: the secrets behind kedarnath hills)

మన భారతీయ చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు చాలా వున్నాయి. అందులో ముఖ్యంగా ఉత్తర బారతదేశంలో పురాతనకాలానికి సంబంధించిన దేవతల విగ్రహాలు, స్థలాలు, పర్వతప్రాంతాలు, మంచుకొండలు, పవిత్రమైన స్థలాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దేశాలు ప్రసిద్ధి చెందాయి. అందులో ఒకటి కేదార్ నాథ్! ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో వుండే ఈ ప్రదేశం... ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. సముద్ర మట్టానికి సుమారు 3,584 కి.మీ. ఎత్తున వున్న ఈ ప్రదేశం... హిమాలయాల ఒడిల హిందువులకు ఒక పవిత్రయాత్రాస్థలంగా పేరు గాంచింది. ఇక్కడున్న శివ భగవానుడి ఆశీస్సులను పొందడానికి వేసవికాలంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది భక్తులు కేదార్ నాథ్ కు తరలివస్తారు.

కేదార్ నాథ్ లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి. అయితే ఆ మంచుకొండలో కొన్ని మహారహస్యాలు దాగివున్నాయి. వాటికి సంబంధించిన విశేసాలు కొన్ని...

1. చోరాబారి సరస్సు : సముద్రమట్టానికి సుమారు 4వేల మీటర్ల ఎత్తులో వుండే ఈ ప్రదేశం నుంచి అందమైన హిమాలయ శిఖరాలను వీక్షించవచ్చు. ఈ సరస్సును గాంధి సరోవర్ అని కూడా అంటారు. ఎందుకంటే.. ఇక్కడ ఇందులో మహాత్మగాంధీ అస్థికలు నిమజ్జనం చేశారు.

chorabari-lake-kedarnath

2. గౌరీకుండ్ : కేదార్ నాథ్ పర్యాటక ప్రదేశాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎంతో పురాతనమైన పార్వతీమాత దేవాలయం వుంది. ఇక్కడున్న నీటిలో ఎన్నో ఔషధ గుణాలు వుంటాయని యాత్రికలు భావిస్తుంటారు. అలాగే అందులో స్నానాలు ఆచరిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.

gowri-kund-kedarnath

3. కేదార్ మాసిఫ్ : ఇది ప్రకృతి అందాలను ప్రదర్శించే ఎంతో అందమైన ప్రదేశం. ఇది సముద్రమట్టానికి 6వేల మీటర్ల ఎత్తులో వుంటుంది. అయితే ఈ ప్రాంతంపై ఎక్కితే శ్వాస పీల్చుకోవడానికి కాస్త ఇబ్బందికరంగా వుంటుంది. అక్కడకు వెళ్లేటప్పుడు అధికారులు ఈమేరకు హెచ్చిరకలు కూడా చేస్తారు. ఇక్కడ కేదార్ నాథ్, కేదార్ డోమ్, భారత కుంట అనే మూడు పర్వతాలు వుంటాయి.

kedar-masif-kedarnath

4. మందాకినీ నది : ఇది అలకనందా ఉపనదిగా పరిగణించబడుతుంది. ఇది ఒక ప్రసిద్ధ నీటిక్రీడల కేంద్రంగా ఎంతోమంది అనేక రకాల క్రీడలు ఆడుతూ ఆనందిస్తారు. సోనా ప్రయాగ్ వద్ద ఈ నది వాసుకి, గంగానదిలో కలుస్తుంది.

mandakini-lake-kedarnath

5. శంకరాచార్య సమాధి : కేదార్ నాథ్ ఆలయానికి సమీపంలోనే ఆదిగురువు శంకరాచార్య సమాధి వుంటుంది. ఇక్కడో విశిష్టమైన అంశమేమిటంటే.. ఆనాడు శంకరాచార్యులు తమ శిష్యులకోసం ఒక నీటి బుగ్గను సృష్టించారని కొన్ని కథనాలు వున్నాయి. ఇప్పటికీ ఆ వేడి నీటిబుడగ ఆ ప్రాంతంలో దర్శనం ఇస్తుంటుంది.

shankaracharya-comb-kedarna

6. వాసుకి సరస్సు : సముద్రమట్టానికి సుమారు 4,135 మీటర్ల ఎత్తున వుండే ఈ సరస్సు.. ఎంతో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అనేక సుందర దృశ్యాలను వీక్షించడానికి ఎంతో అనువుగా వుంటుంది. అయితే ఈ ప్రదేశాన్ని కేవలం జూన్, అక్టోబర్ నెలల్లో సందర్శించడానికి మాత్రమే అవకాశం వుంటుంది.

vasuki-river-kedarnath

7. అగస్త్యముని : మందాకినీ నది ఒడ్డున సముద్రమట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తులో వుండే అగస్త్యముని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది అగస్త్య ముని జన్మస్థలంగా భావిస్తారు. శివభగవానుడి విగ్రహంకల అగస్తేశ్వర్ మహాదేవ దేవాలయం ఇక్కడ వుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాతిగోడలపై చెక్కిన హిందూదేవతలను కూడా చూడవచ్చు.

agastyamuni-kedarnath

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kedarnath  kedarnath hills  mandakini lake  shankaracharya comb  

Other Articles