ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల gantasala a renowed singer and music director

A tribute to ghantasala venkateswara rao on his birthday

Ghantasala Venkateswara Rao, Ghantasala Venkateswara Rao latest news, Ghantasala Venkateswara Rao wikipedia, Ghantasala Venkateswara Rao photos, Ghantasala Venkateswara Rao history, Ghantasala Venkateswara Rao story, Ghantasala Venkateswara Rao life story, Ghantasala Venkateswara Rao, Ghantasala-Venkateswara-Rao

Ghantasala Venkateswara Rao a popular singer, music director, who not only lent voice to hundreds of songs but also composed music to many movies and albums.

ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల

Posted: 12/22/2017 04:34 PM IST
A tribute to ghantasala venkateswara rao on his birthday

తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఒలలాడించిన ఘనా ఘన గాన గంధర్వుడు ఆయన. ఆయన ఆలపించిన పాటలతో అటు నిత్య దైవతారాధనను ప్రారంభించడంతో పాటు ఇటు మనస్సుకు నచ్చినవారిని కూడా మొప్పించవచ్చన్నది నగ్నసత్యం. ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు. తెలుగు చిత్ర పరశ్రమ తొలినాళ్లలో మదురగానాలపై, సంగీతాలపై తనదైన ముద్ర వేసుకుని.. కొన్ని దశాబ్దాల పాటు అదే ఒరవడిని కొనసాగిందంటే కూడా అది అయన ఘనతే. ఆయన స్వరం నుంచి కాక మనస్సు నుంచి అలపించిన ఆధ్యాత్మిక పాటలను లేని తెలుగు రాష్ట్రాల దేవాలయాలు లేవంటే ఆయన వాటిని అలపించిన తీరు.. కనబర్చిన భక్తే కారణం.

దక్షిణాది చిత్రాలలకు చెందిన గాయకుడిగా, మరీ ముఖ్యంగా తెలుగు చలన చిత్రసీమలో ప్రత్యేక ప్రస్థానం ఏర్పరుచుకున్న ఆయన పుట్టుకతోనే గంభీరమైన స్వరాన్ని కలిగివుండటం దైవమిచ్చిన వరమనే అనేక సందర్భాలలో అన్నారాయన.. శాస్త్రీయ, తెలుగుసినీ సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శిక్షణాకాలంలో తన స్వరంతో గురువుల్ని ముగ్ధుల్ని చేసిన ఆయన.. అనంతరం చిత్రసీమలో అదేవిధంగా ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈయన పాడిన ఆధ్యాత్మిక సంగీతాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇప్పటికీ అయన స్వరం నుంచి జాలువారిన పాటలు వినని ప్రేక్షకులు వుండరు.

1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు ఘంటసాల జన్మించారు. తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. సంగీత సభాస్థలికి వెళ్లే సమయంలో ఆయన తనతోబాటు తన కుమారుడు ఘంటసాలను కూడా తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన భజనలు వింటూ, పాటలు పాడుతూ, నాట్యం చేసేవారు. అప్పుడు ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అప్పట్లో ‘బాలభరతుడు’ అని పిలిచేవారు. ఇలావుండగా.. ఘంటసాల 11వ ఏటలో ఆయన తండ్రి మరణించారు. అయితే మరణానికి కొన్నిరోజులముందు సంగీత గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి, గొప్ప సంగీత విద్వాంసుడిగా అవమని కోరారు.

తండ్రి కోరిక మేరకు సంగీతంలో గొప్పపేరు సాధించేందుకు ఆయన అహర్నిశలు ప్రయత్నాలు చేశారు. మొదట ఆయన సగీత గురుకులాలో చేరారు కానీ.. అక్కడి కట్టుబాట్లను తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు. అనంతరం ఒకసారి గ్రామంలో కచేరీలో విద్వాంసులతో పోటీపడి నవ్వులపాలయ్యాడు. దాంతో సంగీతం నేర్చుకోవాలన్న కసి ఆయనలో మరింతగా పెరిగింది. అప్పుడతడు తనకు తెలిసిన కొందరి విద్వాంసుల ఇళ్లలో పనిచేసి, వారిదగ్గరే సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. ఇలా రెండేళ్లపాటు ఒక ఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొని చేయాల్సి వచ్చింది.

తర్వాత ఆయన ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు. అందులో శిక్షణ పొందుతున్న కాలంలో తోటివిద్యార్థులు చేసిన తప్పిదాలవల్ల ఆయనను కళాశాల నుంచి బహిష్కరించారు. అదితెలిసి ఆయనకు చేయూతనిచ్చిన కుటుంబసభ్యులు కూడా తమ ఇళ్లక రావొద్దని చెప్పేశారు. దీంతో గత్యంతరంలేక ఆ ఊరిలో వుండే గుడిలో తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి అనే ప్రముఖ వ్యక్తి.. ఘంటసాల గురించి మొత్తం విషయాలు తెలుసుకుని ఆయనకు తన ఇంట్లోనే ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. అలా ఆయన ఇచ్చిన సహాయంతోనే నేడు ఈ స్థానానికి చేరుకోగలిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghantasala Venkateswara Rao  music director  popular singer  private albums  tollywood  

Other Articles

 • Freedom fighter father of telangana konda laxman bapuji

  తెలంగాణ ఉద్యమాలకు నాంది.. కొండా లక్ష్మణ్ బాపూజీ

  Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more

 • Telanagana recalls professor jayashanker on his death annivesary

  తెలంగాణ జాతిపిత.. సిద్ధాంతకర్త.. ప్రోఫెసర్ జయశంకర్

  Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more

 • Prominent freedom fighter subash chandrabose biography

  అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

  Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more

 • Telangana freedom fighter raavi narayana reddy terror for rajakars

  రజాకార్ల పాలిట సింహ స్వప్నం రావి నారాయణ రెడ్డి

  Sep 26 | తెలంగాణ ప్రాంత స్వతంత్ర సమర యోధుడు, రజకార్ల వెన్నులో వణుకుపట్టించిన ధీరుడు.. కమ్యూనిస్టు నేత రావి నారాయణ రెడ్డి. ఆయన పోరాటం మాత్రమే తెలంగాణలోని అనేక మందికి తెలిసింది. కానీ ఆయన ొక సంఘ... Read more

 • Who is ram nath kovind india s new president

  దేశ ప్రథమ పౌరుడి స్థానంలో అంబేద్కర్ సిద్దాంతి.. రామ్ నాథ్

  Jul 29 | దేశ 14వ రాష్ట్రపతిగా కొనసాగుతున్న రామ్ నాథ్ కోవింద్.. న్యాయకోవిదుడు. డాక్లర్ బిఆర్ అంబేద్కర్ బాటలో నడిచి.. దేశ అత్యతున్నత స్థాయి పదవిని అందకున్నారు. అణగారిన వర్గానికి చెందిన ఆయన చిన్నతనం నుంచి అకుంఠిత... Read more

Today on Telugu Wishesh