ఏం డిసైడ్ చేసినవ్ అన్నా.... | Actor cum writer Tanikella Bharani birthday special

Actor cum writer tanikella bharani birthday special

Tollywood senior actor cum writer, Tanikella Bharani birthday special, Tanikella Bharani about lord shiva, Tanikella Bharani Tanikella Bharani

Tollywood senior actor cum writer Tanikella Bharani birthday special.

ఏం డిసైడ్ చేసినవ్ అన్నా....

Posted: 07/14/2016 01:19 PM IST
Actor cum writer tanikella bharani birthday special

బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ అభిలాష యావ ఉన్న నటుడు మరోకరు ఉండరేమో! సాంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ... ఎంత దూరమైన పయనించేందుకు సిద్ధమైపోతుంటాడు. నమస్తే అన్నా అంటూ ఈ తోట రాముడు... పరమశివుడినే ఏరా అంటూ ఏదో క్లోజ్ ఫ్రెండ్ ని సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీని, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు అంటూ 700 సినిమాలకు పైగా అలరించాడు.

ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన నటుడు రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే సాహితి పిపాసి ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడేమో! ఓ కార్యక్రమంలో తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ పద్యం అని చెపుతూ, “పూతమెరంగులన్” పద్యమును భరణిగారు చదివిన తీరు పండితులను పామరులను సమానంగా ఆకట్టుకుంటుంది నటుడికన్నా ముందు ఒక మంచి రచయిత అయిన భరణి నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే కలం మడిచి జేబులో పెట్టేశానని అంటుంటారు కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం.

‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది.
వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది.
ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను.
కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను.
కవితలను రాసి రాసి అలసిపోయాను.
అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది.
తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి.
బాధలో నా భావనలను చెదరగొట్టాను.
వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి.
భావనలు వెళ్లిపోయాయి
నన్ను వదిలి వెళ్లిపోయాయి’’... అంటూ ఆశువుగా చెబుతుంటే వాహ్ వా... వాహ్ వా... అని నిజంగా అనొచ్చు.

నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. వాటిలోని కొన్ని మచ్చుతునకలు మీకోసం....

సర్వం శివమయం జగత్  అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన ఏకైక సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్‌రా శంకరా...’ అన్నాడు. బహుశా మరో కలం తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలిగేదా. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో! ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ. ఆయనకు తెలుగు విశేష్ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Tanikella Bharani  birthday special  Tanikella Bharani  

Other Articles

 • Telanagana recalls professor jayashanker on his death annivesary

  తెలంగాణ జాతిపిత.. సిద్ధాంతకర్త.. ప్రోఫెసర్ జయశంకర్

  Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more

 • Prominent freedom fighter subash chandrabose biography

  అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

  Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more

 • A tribute to ghantasala venkateswara rao on his birthday

  ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల

  Dec 22 | తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఒలలాడించిన ఘనా ఘన గాన గంధర్వుడు ఆయన. ఆయన ఆలపించిన పాటలతో అటు నిత్య దైవతారాధనను ప్రారంభించడంతో... Read more

 • Telangana freedom fighter raavi narayana reddy terror for rajakars

  రజాకార్ల పాలిట సింహ స్వప్నం రావి నారాయణ రెడ్డి

  Sep 26 | తెలంగాణ ప్రాంత స్వతంత్ర సమర యోధుడు, రజకార్ల వెన్నులో వణుకుపట్టించిన ధీరుడు.. కమ్యూనిస్టు నేత రావి నారాయణ రెడ్డి. ఆయన పోరాటం మాత్రమే తెలంగాణలోని అనేక మందికి తెలిసింది. కానీ ఆయన ొక సంఘ... Read more

 • Who is ram nath kovind india s new president

  దేశ ప్రథమ పౌరుడి స్థానంలో అంబేద్కర్ సిద్దాంతి.. రామ్ నాథ్

  Jul 29 | దేశ 14వ రాష్ట్రపతిగా కొనసాగుతున్న రామ్ నాథ్ కోవింద్.. న్యాయకోవిదుడు. డాక్లర్ బిఆర్ అంబేద్కర్ బాటలో నడిచి.. దేశ అత్యతున్నత స్థాయి పదవిని అందకున్నారు. అణగారిన వర్గానికి చెందిన ఆయన చిన్నతనం నుంచి అకుంఠిత... Read more

Today on Telugu Wishesh