యుగపురుషుడు ఎన్టీఆర్ | NTR birthday special

Ntr birthday special

senior NTR, 94 birth anniversary, ఎన్టీఆర్, 94వ జయంతి, entertainment, telugu news, latest news

metadis: senior NTR birthday special.

యుగపురుషుడు ఎన్టీఆర్

Posted: 05/28/2016 12:51 PM IST
Ntr birthday special

తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగానే కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ మహానేతగా కూడా ఆయన సుపరిచితం. ఆ మహానుభావుడి 94వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో ప్రత్యేక కథనం

- 1923 మే28 సాయంత్రం 4గంటల 32 నిమిషాలకు కృష్ణా జిల్లా నిమ్మకూరులో  లక్ష్మయ్య చౌదరి,  వెంకట రామమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆపై దత్తత మీద మేనమామ దగ్గరికి వెళ్లారు.

-  నిజానికి ఆయనకు ముందుగా పెట్టాలనుకున్న పేరు కృష్ణ. అయితే రాముడు అనే పేరు బావుంటుందని ఆయన మేనమామ సూచించడంతో ఆ పేరే పెట్టారు. అదే ఆయన్ను తెలుగువారికి మరింత దగ్గర    చేస్తుందని బహుశా ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు.


-  విజయవాడ మున్సిపల్ స్కూల్ లో విద్యాభ్యాసం ప్రారంభించిన ఆయన ఆపై ఎస్సాఆర్ఆర్ కాలేజీలో  చేరారు. తెలుగు సాహిత్యవేత్త విశ్వనాథ సత్యనారాయణ శిష్యరికంలో తెలుగు బాషపై పట్టుసాధించారు.       ఆపై    నాటకాల్లోకి ప్రవేశించారు. ఓసారి ఓ నాటకం సందర్భంలో ఎన్టీఆర్ నాగమ్మ అనే ఆడవేషం వేయాల్సి వచ్చింది. ఇందుకోసం మీసాలు తీసేయాలని విశ్వనాథ సత్యనారాయణ ఎన్టీఆర్ కి సూచించారట.      అయితే  అందుకే ససేమిరా అన్న ఎన్టీఆర్ మీసాలతోనే నాటకాన్ని పూర్తి చేశారంట. అప్పటి నుంచి మీసాల నాగమ్మ అనే పేరు ఆయనకు పాతుకుపోయింది.

- 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవతారకమ్మ ను పెళ్లి చేసుకున్నారు. దీంతో చదువు అటకెక్కి పరీక్షల్లో ఫేలయ్యారు. ఆపై గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చేరి విధ్యాభ్యాసం  కొనసాగించారు..

- కొంగర జగ్గయ్య, ముక్కామల, చిత్తూరు నాగయ్య తదితరులంతా నాటకాల్లో ఈయనతో స్టేజీని పంచుకున్నవారే.
- ఓసారి సుభాస్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆయన బొమ్మ వేసి బోస్ దగ్గరి నుంచి ప్రశంసలు అందుకున్నారు.  
- 1942 డిగ్రీ పూర్తి చేసిన ఆయన వెంటనే మద్రాస్ సర్వీస్ పరీక్ష రాశారు. మొత్తం 1100 మంది పరీక్షకు హాజరుకాగా,  7 ఎంపికయ్యారు. అందులో ఎన్టీఆర్ ఒకరు. వెంటనే మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆయన     ఉద్యోగంలో చేరిపోయారు. అయితే సినిమాలపైకి మనసు మళ్లటంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఆ ఉద్యోగం చేసింది కేవలం మూడు వారాలే. బంధువులు తిట్టిపోసినప్పటికీ తనపై తనకు నమ్మకం    ఉందని, వెండితెరపై ఓ వెలుగు వెలుగుతానని సముదాయించారంట.

-  అవకాశాల కోసం ఫోటోలు పంపంగా, బీఏ సుబ్బారావు పల్లెటూరి పిల్ల కోసం ఎన్టీఆర్ ను కథానాయకుడిగా ఎంపిక చేశారంట. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో అవకాశం వచ్చాకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారంట. ఈ విషయాన్ని ఆయన తన భార్య దగ్గర కూడా దాయటం గమనార్హం. ఇక ఈ చిత్రం కోసం ఆయన అందుకున్న పారితోషకం 1116.

- పల్లెటూరి పిల్ల ఆలస్యం కావటంతో మనదేశం లో ఆయన తొలిచిత్రం అయ్యింది. 1949 లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించారు. ఆ మరుసటి సంవత్సరం పల్లెటూరి పిల్ల,     షావూకారి రెండు చిత్రాలు విడుదలయ్యాయి.

-  మనీ మేనేజ్ మెంట్ ఎన్టీఆర్ కి అచ్చొచ్చిన విద్య. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఏనాడూ అప్పు చేసేవారు కాదంట. అంతేందుకు హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో మద్రాస్ లో ఓ ఇల్లు అద్దెకి తీసుకుని      ఉండేవారు. దాని అద్దె 5 రూపాయలు. అంత పెట్టి ఉండటం అవసరమా అనుకున్న ఆయన యోగానంద్ అనే వ్యక్తి తన రూమ్ మేట్ గా చేసుకుని ఉండేవారంట. ఆ ఇంట్లో ఉండగానే ఆయన దశ తిరిగింది.  

- ఆ మరుసటి సంవత్సరం కేవీరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళభైరవి, వరుసగా బీఎన్ రెడ్డి మళ్లీశ్వరి, ఎల్ వీ ప్రసాద్ పెళ్లి చేసి చూడు చిత్రాలు అయన్నీ స్టార్ హీరోని చేశాయి. ఇవన్ని చిత్రాలు ప్రతిష్టాత్మక విజయ బ్యానర్ లోనే రూపుదిద్దుకోవటం విశేషం. పాతాళభైరవి 34 సెంటర్లో వంద రోజులు ఆడటమే కాదు ఆయనకు మాస్ హీరో ఈమేజ్ ను కట్టబెట్టింది.

- ప్రతి సినిమా కోసం ఆయనకు 500 నెలజీతం,  5000 పారితోషకం చెల్లించేవారంట.  1954లో వచ్చిన మూవీ వండర్ మాయాబజార్ తో అప్పటిదాకా ఎవరూ తీసుకోని పారితోషకం 7500 రూపాయలు అందుకున్నారాయన.

- సినిమా కోసం ఆయన ఎంతగా అంకితమయిపోయే వారంటే నర్తనశాల చిత్రం కోసం ప్రముఖ కళాకారుడు వెంపటి చిన్నసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. గంభీరస్వరం మెయింటెన్ చేయటం కోసం మెరీనా బీచ్ లో రోజూ సాధన చేసేవారంట.

- మాయాబజార్ లో కృష్ణుడిగా, లవకుశలో రాముడిగా, రావణ బ్రహ్మగా భూకైలాస్ లో, దానవీరశూరకర్ణలో దుర్యోధనుడిగా ఇలా పౌరాణిక పాత్రన్నింటిలో ఒదిగి జీవించిపోయేవారు.
-  1977లో దానవీరశూరకర్ణ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాదు ఆయన ఓ మంచి అభిరుచిగల నిర్మాత కూడా.
-  అడవిరాముడు, యమగోల లాంటి చిత్రాలు తెలుగు భాక్సాఫీస్ ను షేక్ చేశాయి. 44 ఏళ్ల సినీప్రస్థానంలో మొత్తం 400సినిమాల్లో ఆయన నటించారు. అందులో 13 చారిత్రక, 53 జానపద, 186 సాంఘిక, 44   పౌరాణిక చిత్రాలున్నాయి.

-  సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ విలేకరితో జరిగిన సంభాషణ ఆయన్ను రాజకీయాల్లోకి రావటానికి ప్రేరేపించింది. మీకు వచ్చే ఏడాదితో 60 ఏళ్లు నిండుతాయి కదా. ప్రజల కోసం ఏం చేద్దామనుకుంటున్నారు అని అడగ్గా,  తెలుగు ప్రజలు ఇంతకాలం నన్ను ఆదరించారు కాబట్టి వచ్చే ఏడాది నుంచి నెలలో 15 రోజులు వారి సేవకు అంకితమవుదామనుకుంటున్నా అని బదులిచ్చారంట. ఆయన రాజకీయ ప్రస్థానానికి ఆయన ఇంటర్వ్యూతోనే బీజం పడనట్లయ్యింది.

- 1982 మార్చి 29 మధ్యాహ్నాం 2 గంటలకు సంచలన నిర్ణయంతో చరిత్ర సృష్టించారాయన. రా కదలి రా... నినాదంతో తెలుగు దేశం పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారాయన.
- చైతన్య రథం పేరిట సుడిగాలి పర్యటన నిర్వహించిన ఆయన తన గంభీరమైన ఉపన్యాసాలతో జనాలకు కట్టిపడేశారు.  

- 1983 జనవరి 7 దేశ రాజకీయాల్లో గుర్తుండిపోయే రోజు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళతో పెకలించి 199 సీట్లతో చారిత్రాత్మక విజయం అందుకున్నారు.  
- ప్రజాసంక్షేమ దృష్టిలో పెట్టకునే ఆయన నిర్ణయాలు ఉండేవి. అనవసరమైన ఖర్చులలెందుకుని శాసనమండలి రద్దు చేశారు. ట్యాంక్ బండ్ పై తెలుగు వారి విగ్రహాలు నెలకొల్పారు.
- అయితే నాదెండ్ల కుట్ర తో మధ్యంతరం ఎన్నికలలకు వెళ్లిన ఆయన తిరిగి 202 స్థానాల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
- 1993 లో ఆయన వ్యక్తిగత జీవితం కీలక మలుపు తిరిగింది. తన ఆత్మకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని ఆయన వివాహం చేసుకున్నారు.  
- 1994 2 రూపాయలకే కిలో బియ్యం పథకం, సంపూర్ణ మధ్యపాన నిషేధంలాంటి పథకాలను అమలు చేశారు. ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడ్డా ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ఆయన చెక్కుచెదరలేదు.

- ఆయన రాజకీయ ప్రస్థానం వివాదాలు ఉన్నాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సొంత పార్టీ నేతలు దుమ్మెత్తిపోయగా, నక్సలైట్లు దేశభక్తులంటూ ఆయన ఇచ్చిన ప్రకటన తీవ్ర దుమారాన్ని లేపింది.     ఇక అవమానకర రాజకీయాలతోనే విసిగి వేసారిన ఆయన ఆ దిగులుతోనే 1996 జనవరి 18న 73 వయసులో కన్నుమూశారు.

దేశంలో ఇంతవరకు ఏ నేతను కూడా ప్రజలు ఇంతలా ఆదరించలేదన్నది అక్షర సత్యం. ఇలాంటి మనుషులు యుగానికి ఒక్కరే పుడతారు. ఆ మహనేతకు మా నమ:సుమాంజలి.


 
భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : senior NTR  94 birth anniversary  NTR birthday special  

Other Articles