She walked with Jyothy and she brought light

She walked with jyothy and she brought light

Savitribai Jyotirao Phule , Savitribai Jyotirao Phule in India, Savitribai Jyotirao Phule in campaign, Jyotirao Phule

Savitribai Jyotirao Phule was an Indian social reformer and poet. Along with her husband, Jyotirao Phule, she played an important role in improving women's rights in India during British rule

"జ్యోతి" తో కలిసి నడిచి... జీవితాల్లో "జ్యోతి" వెలిగించి

Posted: 01/05/2016 11:24 AM IST
She walked with jyothy and she brought light

తమ కుటుంబం కోసం ఆలోచించే వారి తదనంతరం, ఆ కుటుంబం, వారిని మర్చిపోతుంది... సమాజం కోసం తపన పడే వారు, భౌతికంగా దూరం అయిపోయినా, సమాజం ఉన్నంతకాలం, వారి మంచిని స్మరించుకుంటూ ఉంటాం... అటువంటి ఓ ఆణిముత్యం, తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు...

యెంత అభివృద్ధి  చెందినా, ఈ రోజుకీ ఆడపిల్లల మీద వివక్ష కొనసాగుతూనే ఉంది... మరి 1820ల కాలం లో ఈ పరిస్థితే ఎలా ఉండేదో, ఊచించడం మీ అంచనాకే వదిలేస్తున్నాం... బాల్య వివాహాలు, ముక్కుపచ్చలారని వయసులో వైధవ్యం, అన్నింటా వివక్ష... ఇలా చెప్పుకుంటూపొతే, ఎన్నో కుసంస్కారాలు... ఇలాంటి సమయంలో, 1831, జనవరి 3న జన్మించింది ఓ ఆశాకిరణం... అందరి ఆడపిల్లల్లాగే, అతి పిన్న వయస్సులో ఈమెకూ వివాహం జరిగింది... కానీ భాగస్వామిగా, బ్రిటీషు వారి పాలనను, అగ్ర వర్ణాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే, మనిషిని మనిషిలాగే చూసే విచక్షణ కలిగి ఉన్నమహాత్మ, జ్యోతిరావు పూలే, ఈమెకు దొరికిన వరం...

"వివాహం విద్యకు అడ్డంకి"... ఈ నానుడిని సమర్ధిస్తూ, ఎన్నో సామెతలూ ఉన్నాయి, నిజ జీవిత సంఘటనలూ, నేటికీ కని - వినపడుతూనే ఉంటాయి... కానీ, ఈ ఉత్తమురాలి జీవితం, వివాహం తరువాతే మొదలయ్యింది... భర్త జ్యోతిరావు, ఈమెను విద్యావంతురాలిని చేసారు... "ఏమిటీ విడ్డూరం??? ఆడపిల్లకి చదువేంటి??? ఆడది పుట్టిందే మగాడి అవసరాలు తీర్చడం కోసం... మగాడితో మొదలయ్యి... మగాడితో ముగిసే ఆడదాని జీవితానికి, ఇల్లు - వంటిల్లు కాకుండా చదువుతో ఏం పని?", ఇందుకు వంద రేట్లు వివక్ష ఎదురయ్యింది ఈ దంపతులకి... కానీ, వీరి ఉత్తమ సంకల్పాన్ని, ఏదీ ఆపలేకపోయింది... భర్త అండగా ఉండగా, ఇంక తనకేం భయం అనుకుంది ఆ ఇల్లాలు... అన్ని హింసలకూ, భౌతిక దాడులకు కూడా సిద్ధపడి, విద్యావంతురాలయ్యింది... తోటి మహిళలకి, కులం - జీవన విధానానికి అతీతంగా, అందరు మహిళలూ విద్యావంతులవ్వాలని కృషి చెయ్యడం మొదలు పెట్టింది... రాత్రి బదులు ప్రారంభించింది... అన్నీ వివక్షలూ, ఈ దంపతుల ఆత్మ స్థయిర్యం ముందు పఠాపంచలయ్యాయి... ఒక్కో మెట్టూ ఎక్కుతూ, అగ్ర - బలహీన వర్గాల మహిళలకు విద్యను అందించడం, చిన్నవయస్సులోనే వైధవ్యాన్ని అనుభవించే మహిళలను చేరదీసి ఆశ్రయం ఇవ్వడం, గర్భవతులైన, ఆశ్రయం లేని మహిళలకు, పురుడు పోయ్యడమూ చేసారీమే... అట్లాంటి ఓ అభాగ్యురాలికి కలిగిన సంతానానికే, యశ్వంత్ అని నామకరణం చేసి, ఆ తల్లి బిడ్డను తమ వద్ద వదిలేసిపోవడంతో, దత్తత తీసుకుని, వీరి ఆశయాలకు తగ్గట్టుగా పెంచుకున్నారు... "తమ రక్తం కాని సంతానంతో ఇబ్బందులు తప్ప మరొకటి ఉండదు", అంటూ వాదించే వారికి, "పుట్టుక కాదు, పెంపకమే మనిషిని మనిషిగా చేస్తుంది" అని నిరూపించారు, ఈ ఉత్తమ దంపతులు...

1876 లో తొలి మహిళా పాఠశాలను ప్రారంభించారు ఈ దంపతులు...ఇంతటితో ఆగక, ఆ తరువాతి సంవత్సరం పూర్తయ్యే సమయానికి మహారాష్ట్ర అంతటా ఇట్లాంటి విద్యాలయాలు 50 వరకూ, ఆడపిల్లలకు వరంగా ప్రారంభింపబడ్డాయి ... ఇంత చేస్తే ప్రభుత్వం మాత్రం గుర్తించకుండా ఉంటుందా??? బ్రిటీషు ప్రభుత్వం కూడా, ఈమె స్థాయిర్యానికి తలొంచక తప్పలేదు... "ఉత్తమ ఉపాధ్యాయురాలిగా" ఈమెకు గౌరవం ఇచ్చింది...

1890 లలో ప్రాణాంతక ప్లేగు మహమ్మారి మాహారాష్ట్రని వణికించింది... ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకుని సేవ చేసారు ఈ సంపతులు, తమ సంతానంతో సహా... చివరికి ఇదే వ్యాధి, ఆమెను భౌతికంగా మనకు దూరం చేసింది... మార్చ్ 10, 1897 న ఈమె స్వర్గస్తులయ్యారు ... మార్చ్ 10, 1998, మన ప్రభుత్వం, ఈమె పేరున, పోస్టల్ స్టాంపును విడుదల చేసింది...

ఎందరో మహానుభావులు... అందులో ఒకరు, ఈమె... సావిత్రి భాయ్ పూలే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles