Gurazada Apparao wrote the Telugu play Kanyasulkam

Gurazada apparao wrote the telugu play kanyasulkam

Gurazada Venkata Apparao was a Telugu poet and writer of Andhra Pradesh, India. He wrote the Telugu play, Kanyasulkam, which is often considered the greatest play in the Telugu language

Gurazada Venkata Apparao was a Telugu poet and writer of Andhra Pradesh, India. He wrote the Telugu play, Kanyasulkam, which is often considered the greatest play in the Telugu language

ఆధునిక సాహిత్య యుగకర్త గురజాడ అప్పారావు

Posted: 12/01/2015 01:30 PM IST
Gurazada apparao wrote the telugu play kanyasulkam

గురజాడ అప్పారావు గారు తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు  వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.

విశాఖ జిల్లా, ఎలమంచిలిలో, మేనమామ ఇంట్లో సెప్టెంబరు21, 1862 న, వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. వీరికి శ్యామల రావు అనే తమ్ముడు ఉన్నారు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది.. అప్పారావు గారి తండ్రిగారు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా, రెవిన్యూ సూపర్వసరు మరియు ఖిలేదారు గాను పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లి లో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రిగారు కాలం చెయ్యటంతో, విజయనగరంకి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో ఏం. ఆర్. కాలేజి, అప్పటిప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి గారు ఈయనను చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884 లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హై స్కూలులో టీచరు గా చేరారు.

1885 లో అప్పారావు గారు అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. 1887 లో సంవత్సరంలో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మి నరసమ్మ పుట్టారు. 1890 లో కుమారుడు వెంకట రామదాసు, 1902లో రెండవ కుమార్తె పులిగెడ్డ కొండయ్యమ్మ జన్మించారు. అప్పటి కళింగ రాజ్యం గా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావుగారు ఉండడం జరిగింది. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో మంచి సంబంధాలు ఉండేవి. 1887 లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వీరు మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాన్గిక సేవకై "విశాఖ వలంటరి సర్వీసు" లో చేరారు. 1889 లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు.

ఇదే సమయంలో తమ్ముడు శ్యామల రావు తో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం "సారంగధర" "ఇండియన్ లీషర్ అవర్" లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తా లో ఉన్న "రీస్ అండ్ రోయిట్" ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావు గారిని తెలుగులో రచన చేయడానికి  ప్రోత్సహించారు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాశేనని, తన మాత్రు భాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరనిఅన్నారు. గుండుకుర్తి వెంకట రమణయ్యగారు, "ఇండియన్ లీషర్ అవర్"ఎడిటరు కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించారు. 1891 లో విజయనగర సంస్థానంలో సంస్థానశాసనపరిశోధకునిగా నియమింపబడ్డారు. 1897లో మహారాజ ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గారికి ఆంతరంగిక సెక్రెటరీగా నియమింపబడ్డారు.

1892 లో గురజాడ వారి "కన్యాశుల్కం" నాటిక వేయబడింది. అది మొదటి సారే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రజోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. ఈ నాటకం సాంఘిక ఉపయోగం తో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడచ్చని నిరూపించింది. దీని విజయంతో , అప్పారావు గారు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి గారుముఖ్యులు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రసంసించడంతో అప్పారావు గారికి ఎంతో పేరు వచ్చింది.

1896 లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897 లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ , మద్రాసు వారు ప్రచురించారు. ఇది అప్పారావు గారు - మహారాజ ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో "కన్యాశుల్కం" తిరిగి వ్రాసారు. 1910 లో "దేశమును ప్రేమించుమన్నా" అన దేశ భక్తీ గీతాన్ని వ్రాసారు, ఇది ఎంతో పేరు పొందింది. 1911 లో మద్రాస్ విశ్వవిద్యాలయం "బోర్డు అఫ్ స్టడీస్" లో నియమించబడ్డారు . అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి "ఆంధ్ర సాహిత్యపరిషత్తు" ప్రారంభించారు. 1913 లో అప్పారావు గారు పదవీ విరమణ చేసారు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడేవారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు "ఫెలో" తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు.
 
వీరి ఇతర రచనలు:
ది కుక్ - ఆంగ్ల పద్యం - 1882
సారంగధర - ఆంగ్ల పద్య కావ్యం -1883
చంద్రహాస - ఆంగ్ల పద్య కావ్యం
విక్టోరియా ప్రశస్తి - విక్టోరియా మహారాణిని పొగుడుతూ రీవా మహారాణి తరపున అప్పటి భారత వైస్రాయి కి ఆంగ్ల పద్యాలు -1890
కన్యాశుల్కము – నాటకం - మొదట -1892, తర్వాత -1909
శ్రీ రామ విజయం మరియు జార్జి దేవచరితం - ఆంగ్లవ్యాఖ్య మరియు పరిచయం -1894
సి పి బ్రౌన్ దొర వారి "తాతాచారి కధలు" మరియు "ది వార్స్ ఆఫ్ రాజాస్, బీయింగ్ ది హిస్టరీ ఆఫ్ హందె అనంతపురం" తిరిగివ్రాసారు. - ఇవి అప్పారావు గారు కాలం చెందినా తర్వాత ప్రచురించబడ్డాయి- 1890
హరిశ్చంద్ర - ఆంగ్ల నాటకముకు ఆంగ్లంలో వ్యాఖ్య మరియు పరిచయం – 1897
మిణుగుర్లు - పిల్లల కధ – 1903
కొండుభట్టీయం - అసంపూర్ణ హాస్య నాటిక – 1906
నీలగిరి పాటలు - నీలగిరి కొండల అందాలను వర్ణించే పాటలు -1907

పత్రికలలో వ్యాసాలూ -
మద్రాస్ కాంగ్రెస్ పార్టీ సంవత్సర సమావేశంలో బ్రిటిష్ పాలకులను తరిమికొట్టే విషయంలో భారతీయులలో ఉన్న లోపాలను విమర్శిస్తూ వ్రాసినవి.
"చన్న కాలపు చిన్న బుద్ధులు," - హాలీ తోకచుక్క విషయమై ప్రజలలో వచ్చిన మూఢ నమ్మకాలను విమర్శిస్తూ వ్రాసిన వ్యాసం – 1910
" ముత్యాల సరములు" మరియు "కాసులు" - అప్పారావు గారు తమ స్వంత ఛందస్సులో - మాత్ర ఛందస్సు - చేసిన పద్యాలు – 1910.

దేశభక్తి గీతం
“దేశమును ప్రేమించు మన్న" 1910

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles