father of Indian white revolution is Dr Verghese Kurien

Father of indian white revolution is dr verghese kurien

Dr Verghese Kurien, father of White Revolution, Amul, Operation Flood, largest milk producer, Milkman of India, dairy cooperative sector, milk, Gujarat, Anand, Manthan, Verghese Kurien death anniversary, NDDB, GCMMF, IRMA

Father of the White Revolution, Dr Verghese Kurien, the man behind Operation Flood who made India the largest milk producer in the world. Social entrepreneur Dr Verghese Kurien, known as the father of White Revolution, was the man behind Operation Flood. He was the chief architect who made India the largest milk producer in the world.

మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వర్ఘీస్ కురియన్

Posted: 11/26/2015 11:38 AM IST
Father of indian white revolution is dr verghese kurien

కురియన్‌ శ్వేత విప్లవ పితామహుడు. దేశంలో ఎక్కడైనా అందరికీ పాలు అందుతున్నాయంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే. గ్రామ గ్రామానా పాల ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి పాల నిల్వలతో ప్రపం చానికి ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే ఆయన గాడ్‌ఫాదర్‌. పాలు ఉత్పత్తి చేసే వారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చిన కురియన్‌ మన దక్షిణాది నుంచే అక్కడకు వెళ్ళారు. 1921 నవంబరు 26న కేరళలోని కాలికట్‌లో జన్మించిన కురియన్‌ మద్రాసు లయోలా కాలేజీలో డిగ్రీ అందుకున్నారు. ఆ తరువాత మిషిగాన్‌ యూనివర్శిటీలో డెయిరీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ అందుకు న్నారు. 1949లో గుజరాత్‌లోని కైరా జిల్లా కో ఆపరే టివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌లో ఉద్యోగిగా చేరారు. ఇక్కడ చేరడానికి యూనివర్శిటీలో అతని స్నేహితుడు త్రిభవనదాస్‌ పటేల్‌ అమూల్‌ కారణం.

అమూల్‌గా పిలుచుకునే త్రిభువన్‌దాస్‌ కైరా జిల్లా కో ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌కు చైర్మ న్‌గా ఉండేవారు. అతని కోరిక మేరకు పాల పరికరా లు ఏర్పాటు చేయడానికి ఆ సంస్థలో జాయిన్‌ అయ్యా రు అక్కడి నుండి కురియన్‌ పాల విప్లవం మొదల య్యింది. జిల్లాలోని పాల ఉత్పత్తి సంఘాల న్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చారు. అమూల్‌ పేరున అన్ని సంఘా లను విలీనం చేశారు. పాల ఉత్పత్తి పెంచడానికి రైతుల వద్దకు వెళ్ళి సూచనలిచ్చారు. మిగిలిన పాలను పాలపొడిగా మార్చి ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్‌ చేశారు. దీంతో అమూల్‌ పాలకు డిమాండ్గ పెరిగింది. దీనికి సంబంధించి గుజరాత్‌ రాష్ర్టమంతటా పాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విజయాలకు అందలమెక్కారు కురియన్‌ 1979 నుంచి 2006 వరకూ అమూల్‌ సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు.  

అమూల్‌ విజయానికి ముగ్ధుడైన అప్పటి ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశవ్యాప్తంగా అమూల్‌ మోడల్‌ను ప్రతిబింబించేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి దానికి కురియ న్‌ను చైర్మన్‌గా నియమించారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ.  పాల సేకరణకు 1970లో ఆపరేషన్‌ ఫ్లడ్గను ప్రారంభించారు. 1965 నుండి 33 సంవత్స రాల పాటు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు అధ్యక్షుడిగా కురియన్‌ పనిచేశారు.  ఒక జాతీయ పాల గ్రిడ్‌ సృష్టించారు. ఈ సంస్థ కింద 10 లక్షల మంది రైతులు 20 మిలియన్‌ లీటర్లు దేశ వ్యాప్తంగా 200 పాడి పరిశ్రమ సహకార సంఘాలు అందిస్తున్నాయి.

పాడి పరిశ్రమకు ఆయన చేసిన కృషికి డాక్టర్‌ కురియన్‌ భారత, విదేశీ పురస్కారాలు అందుకుతన్నారు. కమ్యూనిటీ లీడర్‌షిప్‌ కోసం 1963లో రామన్‌ మెగసేసే అవార్డు. 1966లో డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ నుంచి పద్మభూషణ్‌,  1986లో కృషి రత్న అవార్డు, 1986లో వాల్టెర్‌ శాంతి అవార్డును, 1989లో వరల్డ్‌ ఫుడ్గ ప్రైజ్‌ అవార్డును, 1993లో ప్రపంచ డెయిరీ ఎక్సో నుండి మ్యాన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డును, 1999లో పద్మ విభూషణ్‌ అవార్డును అందుకున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles