The Biography Of Gullapalli Nageswara Rao Who Is The Founder Of LV Prasad Eye Institute In Hyderabad | Padma Sri Award Winners

Gullapalli nageswara rao biography lv prasad eye institute founder padma sri award

Gullapalli Nageswara Rao biography, Gullapalli Nageswara Rao history, Gullapalli Nageswara Rao life story, Gullapalli Nageswara Rao updates, Gullapalli Nageswara Rao wikipedia, Gullapalli Nageswara Rao wiki telugu, indian ophthalmologists, lv prasad eye institute, hyderabad lv prasad

Gullapalli Nageswara Rao Biography LV Prasad Eye Institute Founder Padma Sri Award : The Biography Of Gullapalli Nageswara Rao Who Is The Founder Of LV Prasad Eye Institute In Hyderabad.

ఎల్.వి.ప్రసాద్ కంటి వైద్యశాల స్థాపనకు మూలకారకుడు

Posted: 09/02/2015 05:01 PM IST
Gullapalli nageswara rao biography lv prasad eye institute founder padma sri award

గుళ్ళపల్లి నాగేశ్వరరావు... ప్రముఖ నేత్రవైద్య నిపుణుడైన ఈయన హైదరాబాదులోని ‘ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల’ స్థాపనకు మూలకారకుడు. అంతర్జాతీయ కంటి వైద్యశాస్త్ర రంగంలో ‘నాగ్’ పేరుతో ప్రఖ్యాతిగాంచిన ఈయన.. కంటికి సంబంధించిన వ్యాధులపై 250 పరిశోధన వ్యాసాలు రాశారు. ఈయన ఆధ్వర్యంలోనే 2,50,000 మందికి కంటి శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యవిభాగంలో ఎంతో కృషి చేయడంతోపాటు అంధత్వ నివారణకు చేసిన సేవలకుగాను నాగేశ్వరరావుకు పద్మీశ్రీతోపాటు పలు పురస్కారాలు లభించాయి. పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి.

జీవిత విశేషాలు :

1945 సెప్టెంబర్ 1వ తేదీన కృష్ణాజిల్లాలోని చోడవరం (నాగాయలంక మండలం) ఈడుపుగల్లులో జన్మించారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పి.యు.సి., ఆ తర్వాత గుంటూరు వైద్య కళాశాలలో యం.బి.బి.యస్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో కంటి జబ్బులకు సంబంధించిన ప్రత్యేక కోర్స్ చేశారు. 1974లో ఉన్నత విద్య కోసం బోస్టన్, అమెరికా వెళ్ళాడు. రోచస్టర్ విశ్వవిద్యాలయం వైద్య కళాశాలలో వైద్యునిగా, బోధకునిగా 1986వరకు కొనసాగారు. యల్.వి. ప్రసాద్ తనయుడు రమేష్ ప్రసాద్ ప్రోద్బలంతో హైదరాబాదులో ‘యల్.వి. ప్రసాద్ కంటి వైద్యశాల’ స్థాపించడానికి మూల కారకుడయ్యారు. అంతేకాదు.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థగా దానిని రూపొందించారు.

నాగేశ్వరరావు చెప్పిన కొన్ని ముఖ్యమైన విశేషాలు :

‘సామాన్యుడి కష్టసుఖాలు నాకు తెలిసేలా చేసింది మా ఊరే. ఈడుపుగల్లు వంటి పల్లెటూళ్లో పెరగడం అనేది నా అదృష్టం అనుకుంటాను. పల్లెటూరిలో పుట్టి పెరిగినవారు మెడిసిన్‌లోకి వెళితే మాత్రం మంచి వైద్యులు కాగలరని, బాగా పేరు తెచ్చుకోగలరని నా అభిప్రాయం. ఎందుకంటే.. పల్లెటూళ్లో కనీసం కొన్నేళ్లు పెరిగితే సామాన్య మానవుల కష్టసుఖాలు ఏమిటో అర్థమవుతాయి. ఏదో సెలవులకు చుట్టపుచూపుగా వెళితే అర్థమయ్యే విషయాలు కావు అవి. వైద్యులనే కాదు, ఏ రంగంలో రాణించాలన్నా పల్లెటూళ్ల జీవన శైలి తెలిసి ఉండటం మంచిది. మా ఊరే నన్ను మంచి వైద్యుణ్ని చేయడంతోపాటు మంచి వ్యక్తిగా తీర్చిదిద్దింది’ అని ఆయన ఓ సందర్భంలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian ophthalmologists  Gullapalli Nageswara Rao  LV prasad eye institute  

Other Articles