The Biography Of Suthi Veerabhadra Rao | Telugu Famous Comedians | South Indian Film Industry

Suthi veerabhadra rao biography famous south indian film actor comedian

Suthi Veerabhadra Rao, telugu comedians, Suthi Veerabhadra Rao biography, Suthi Veerabhadra Rao life story, Suthi Veerabhadra Rao history, Suthi Veerabhadra Rao news, Suthi Veerabhadra Rao updates, Suthi Veerabhadra Rao news, Suthi Veerabhadra Rao photos, telugu famous actors, telugu comedians

Suthi Veerabhadra Rao biography famous south indian film actor comedian : The Biography Of Suthi Veerabhadra Rao who was a very popular south Indian film actor who played comedians and character artists, as well as a renowned radio /theater artist.

తెలుగువారికి సుపరిచితుడైన ప్రముఖ హాస్యనటుడు ‘సుత్తి’

Posted: 07/01/2015 04:06 PM IST
Suthi veerabhadra rao biography famous south indian film actor comedian

తెలుగుచిత్రపరిశ్రమలో ఎందరో హాస్యనటులు తమ నటనాశైలితో ప్రేక్షకులను నవ్వించారు. వారందరూ ‘హాస్యం’ అనే పదానికి ఆజ్యం పోసి సాధారణ ప్రజలకు చేరవేశారు. ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ఆ నటులు జీవితాన్ని కొనసాగించారు. అలాంటివారిలో ‘మామిడిపల్లి వీరభద్ర రావు’ ఒకరు. రేడియో, నాటక కళాకారుడైన ఈయన.. తెలుగువారికి సుపరిచితుడైన ప్రముఖ హాస్యనటుడు. ఈయన ‘సుత్తి వీరభద్ర రావు’గా ప్రసిద్ధిగాంచారు.

జీవిత విశేషాలు :

1947 జూన్ 6వ తేదీన గోదావరి జిల్లాలో వీరభద్రరావు జన్మించారు. ఈయన తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడకు తరలి వెళ్ళారు. వీరభ్రదరావు విజయవాడలో వున్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. ఈయనకు తన బాల్యం నుంచే నాటకరంగం మీదు ఎక్కువ ఆసక్తి వుండేది. అందుకే.. తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను కాదనుకుని.. నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరి రెండు దశాబ్దాలు పనిచేశారు. అప్పుడు ఈయన నాటక విభాగములో కూడా చాలాకాలం పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనకు చిత్రపరిశ్రమతో సంబంధం వున్న వ్యక్తులతో పరిచయం పెరిగింది.

ఒక సందర్భంలో ఈయన సరదాగా గడిపేందుకు చిత్రసీమకు చెందిన తన మిత్రుని దగ్గరకు వెళ్లారు. అక్కడ ఈయనను చూసిన దర్శకుడు ‘మాదాల రంగారావు’.. అతని హాస్యానికి (హ్యూమర్)కి ముగ్ధుడయ్యాడు. దీంతో ఆయన్ను పరిశ్రమలోకి తీసుకురావాలని రంగారావు భావించారు. ఆ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన ‘బలిపీఠం’ సినిమాతో వీరభద్రరావును చిత్రరంగ ప్రవేశము చేయించారు. ఆ తర్వాత తన మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన జంధ్యాల దర్సకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో వీరభద్రరావు చిత్రసీమలో స్థిరపడ్డారు. 1980లో చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన ఈయన.. ఎన్నో సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్ని తన హాస్యంతో నవ్వించారు. హాస్యనటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. గొప్ప హాస్యనటుడిగా పేరొందిన ఈయన పేరులో ‘సుత్తి’ అనే పదం భాగమైంది. సినీరంగంలో చేరి 50కి పైగా చిత్రాలలో నటించి ఎనలేని కీర్తి సంపాదించారు.

మరణం :

వీరభదరుడు మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆరోగ్యరీత్యా ఎన్నో జాగ్రత్లు పాటించేవారు. 1988లో ‘చూపులు కలసిన శుభవేళ’ చిత్రానికి హైదరాబాదులో ఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు ఈయన కాలు బెణికింది. దాంతో ఆయన్ను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసము చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన తుదిశ్వాస విడిచారు. అది 1988, జూన్ 30వ తేదీన జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Suthi Veerabhadra Rao  telugu comedians  tollywood actors  

Other Articles