The Biography Of Famous Telugu Director and Producer Gudavalli Ramabrahmam | social problems films

Gudavalli ramabrahmam biography who makes social problems films

Gudavalli Ramabrahmam, Gudavalli Ramabrahmam biography, Gudavalli Ramabrahmam history, Gudavalli Ramabrahmam life story, social problem films, social problems movies, social message movies, telugu famous producers, telugu famous directors

Gudavalli Ramabrahmam Biography Who makes social problems films : Gudavalli Ramabrahmam was an Indian film director, screenwriter, and producer known for his works predominantly in Telugu cinema. He is known for directing critically acclaimed social problem films like Mala Pilla (1938) and Raithu Bidda (1939).

సినిమాకి సామాజిక పరమార్థం నేర్పిన దర్శకుడు

Posted: 06/24/2015 04:38 PM IST
Gudavalli ramabrahmam biography who makes social problems films

సినిమా.. వెండితెరపై కనువిందు చేసే అద్భుతమైన రంగుల ప్రపంచం. దీనిని వీక్షిస్తున్నంతవరకు ప్రతిఒక్కరు వినోదాన్ని ఆస్వాదిస్తారు. సినిమా చూస్తున్నంతవరకు సమాజంతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా అందులోనే మునిగిపోతారు. ఇంతలోనే ఒకాయన సినిమా రూపురేఖల్ని మార్చేశాడు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. దాంతో సామాజిక ప్రయోజనాల్ని కూడా పొందవచ్చని ఓ దర్శకుడు ముందుకొచ్చాడు. తాను తీసిన సినిమాలతో సామాజిక పరమార్థం ఏంటో సినీజనాలకు తెలిసేలా చేశాడు. ఆయనే గూడవల్లి రామబ్రహ్మం. ప్రఖ్యాత సినీ దర్శకుడు అయిన ఆయన.. ‘మాలపిల్ల, రైతుబిడ్డ’ చిత్రాల ద్వారా సినిమాకి సామాజిక పరమార్థమేంటో నేర్పించారు.

జీవిత విశేషాలు :

1902లో కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని నందమూరు గ్రామంలో గూడవల్లి రామబ్రహ్మం జన్మించారు. ఈయన విద్యాభ్యాసం ఇందుపల్లి, గుడివాడ, బందరులలో సాగింది. ఆయనకు 18 ఏళ్ళ వయసులో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. అనంతరం 1924లో ‘ఫ్రెండ్స్ అండ్ కో’ అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించారు. అయితే.. కాలక్రమంలో వ్యాపారం తగ్గిపోవడంతో 1930లో దాన్ని మూసివేయాల్సి వచ్చింది. 1931లో ‘అఖిలాంధ్ర రైతు మహాసభ’ను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించారు. 1934లో ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

సినిమా జీవితం :

పత్రికారంగంలో కొనసాగుతున్న కాలంలో రామబ్రహ్మంకు సినిమాల ఆసక్తి పెరిగింది. దాంతో ఆయన పత్రికారంగాన్ని వదిలిపెట్టి.. ‘సారథిచిత్ర’ అనే చిత్ర నిర్మాణసంస్థను స్థాపించారు. ఆయన.. 1934లో ‘శ్రీ కృష్ణ లీలలు’, 1936లో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ సినిమాలను తీశారు. ఈ పౌరాణిక చిత్రాల తర్వాత ఆయన ‘మా పిల్ల’ అనే సినిమాను తీశారు. అది తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తాను స్థాపించిన సారథిచిత్ర బ్యానర్ మీద స్వయంగా నిర్మించి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938 లో విడుదలైంది. కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో రామబ్రహ్మం రూపొందించగా.. అది అసలుసిసలైన సామాజిక ప్రయోజనకంగల చిత్రంగా చరిత్రపుటల్లో నిలిచిపోయింది.

ఆ చిత్రం తర్వాత ఆయన జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ‘రైతుబిడ్డ’ సినిమాను తెరకెక్కించారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీలో.. భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ‘రైతుబిడ్డ’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు జమీందార్ల నుంచి వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఎదురైంది. జమీందార్లు ఈ సినిమాను ప్రభుత్వంచే నిషేధింపజేయగలిగారు. ఈ సినిమాను నిషేధించినా.. ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. ఇంకో విచిత్రమేమిటంటే.. జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించింది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gudavalli Ramabrahmam  Social problems Movies  Telugu Directors  

Other Articles