Ajay vincent biography cameraman indian film industry

ajay vincent news, ajay vincent biography, ajay vincent cameraman, ajay vincent history, ajay vincent story, ajay vincent movies, ajay vincent filmography, ajay vincent death news, ajay vincent life story, ajay vincent history, ajay vincent story, ajay vincent family members, ajay vincent direction, telugu cameramans, famous cameramen

ajay vincent biography cameraman indian film industry : The biography of ajay vincent who worked as cameraman more than 100 films and also done some movies as director.

వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించిన విన్సెంట్...

Posted: 02/28/2015 04:29 PM IST
Ajay vincent biography cameraman indian film industry

వెండితెరపై ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి ప్రేక్షకులను అబ్బురపరిచిన తెరవెనుక మనుషుల్లో విన్సెంట్ ఒకరు! డిజిటల్‌ హంగులు లేని కాలంలోనూ ఈయన తన కెమెరాతో మాయాజాలాన్ని ప్రదర్శించిన మహోన్నత ఛాయగ్రాహకుడు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం అందరికీ గుర్తుండే వుంటుంది. అందులో చిరంజీవిని నిజమైన జగదేకవీరుడిగానూ, శ్రీదేవిని సౌందర్యవంతమైన అతిలోక సుందరిగానూ చూపించడంలో ఆయనకు ఆయనే సాటి! కేవలం కెమెరామెన్ గానే కాదు.. దర్శకుడిగానూ ఆయన తన ప్రతిభను నిరూపించుకోగలిగారు.

జీవిత చరిత్ర :

1928 జూన్‌ 14న తేదీన కేరళలోని కాలికట్‌ ప్రాంతానికి చెందిన అనెస్టినా- జార్జ్‌ దంపతులకు అజయ్ విన్సెంట్ జన్మించారు. అక్కడే కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. సినీరంగంపై ఎక్కువ మక్కువ వుండటంతో 1950 దశంలో మద్రాసుకు పయనమయ్యారు. పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకోవడంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. చివరగా ఈయనకు ఓ అరుదైన అవకాశం వచ్చింది. ‘చండీరాణి’ సినిమాకు ఛాయగ్రాహకుడిగా పనిచేసే ఛాన్స్ వరించింది.

అలా ఆ విధంగా కెమెరామెన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయనకు.. ఇతర చిత్రపరిశ్రమల నుంచి కూడా మరిన్ని ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు మలయాళంలో 'నీలకుయిల్‌' తొలిచిత్రానికి కెమెరామెన్ గా ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని ఆయన ఎంతో అద్భుతంగా తెరకెక్కించి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే కెమెరామెన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విన్సెంట్.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 100కుపైగా చిత్రాలకు పని చేశారు.

అగ్రకథానాయకుల నుంచి నేటి యువ హీరోల చిత్రాలకు సైతం కెమెరామెన్ గా పనిచేసిన విన్సెంట్.. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. మలయాళంలో ఆయన దర్శకత్వం వహించిన 'తులాభారం' చిత్రం అవార్డుల వర్షం కురిపించింది. ఆ చిత్రం ఆయనకు జాతీయ పురస్కారాన్ని అందించింది. ఈ విధంగా అన్ని భాషారంగాల్లోనూ అగ్రహీరోలతో సినిమాలు తెరకెక్కించారు. ఆయన చివరిసారిగా 1985లో వచ్చిన మాలయాళ 'పౌర్ణమి రావిల్‌' 3డీ చిత్రానికి దర్వకత్వం వహించారు.

తెరవెనుక వుంటూ వెండితెరపై ఎన్నో అద్భుతాలను సృష్టించిన అజయ్ విన్సెంట్.. అనారోగ్యంతో బాధపడుతూ 25-02-2015వ తేదీన చెన్నైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విన్సెంట్‌కు భార్య మాగ్రెన్ట్‌, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajay vincent biography  famous cameramen  

Other Articles