Rk lakshman biography who is the irony cartoonist

rk lakshman news, rk lakshman cartoonist, rk lakshman life story, rk lakshman history, rk lakshman biography, rk lakshman wikipedia, rk lakshman wiki, rk lakshman latest news, cartoonist rk lakshman news, telugu news, rk lakshman photos, telugu news websites, telugu movie news websites, telugu political news website

rk lakshman biography who is named as famous irony cartoonist in india

దేశంలో వ్యంగ్య చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్న లక్ష్మణ్!

Posted: 10/24/2014 05:46 PM IST
Rk lakshman biography who is the irony cartoonist

కాలక్రమంలో జరుగుతున్న వాతావరణ పరిస్థితులు... మారుతున్న రాజకీయ పరిణామాలు... సాధారణ మానవుల్లో వస్తున్న మార్పులు... తదితర విషయాల మీద దీర్ఘాలోచన చేసి కొంతమంది వ్యంగ్యంగా తమ అభిప్రాయాలను తెలిపేవారు. అలాగే మరికొంతమంది వ్యంగ్యంగా చిత్రాలు గీస్తూ సంచలనం సృష్టించేవారు. అటువంటివారిలో ఆర్.కె.లక్ష్మణ్ కూడా ఒకరు. భారతదేశంలో ఎంతోమంది పేరు తెచ్చుకున్న వ్యంగ్య చిత్రకారుల్లో ఈయన ఒకరు. కొన్ని దశాబ్దాల నుంచి కేవలం ఒకే పత్రికలో పనిచేస్తూ.. తన కార్టూన్లకు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు ఈ వ్యక్తం! ముఖ్యంగా ఈయన రాజకీయ నాయకులు మీద, రాజకీయ పరిణామాల మీదే ఎక్కువ వ్యంగ్యంగా చిత్రాలు వేస్తుంటాడు. వీటన్నిటికంటే ఈయన సృష్టించిన సామాన్య వ్యక్తి పాత్ర కార్టూన్లే చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.

జీవితచరిత్ర :

1924 అక్టోబర్ 23వ తేదీన మైసూర్ నగరంలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. ఇతని తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యయుడు... ఈయన ఆరుగురి సంతానంలో లక్ష్మన్ చిన్నవాడు! లక్ష్మణ్ అసలు పేరు రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్! ఇంకా చదువుకోకముందే లక్ష్మణ్ బొమ్మల పుస్తకాలను, బొమ్మలను చిత్రీకరించే ఆంగ్లపత్రికలను ఎక్కువగా చూస్తుండేవాడు. అలా బొమ్మల పుస్తకాలూ చూస్తూ బొమ్మలు వేయడం ప్రారంభించాడు. చివరికి తన ఉపాధ్యాయుల వ్యంగ్య చిత్రాలను కూడా గీసి, తన తోటి విద్యార్థులను నవ్వించేవాడు. ఇతడు వేసిన బోధి వృక్షం ఆకు బొమ్మను వీరి టీచర్లు కూడ మెచ్చుకున్నారు. ఇక అప్పటినుంచి తానొక చిత్రకారుడనే భావనను పెంచుకున్నాడు.

హైస్కూలు తరువాత ముంబాయిలోని జె.జె ఇన్సిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ (J J Institute of Applied Art)కు అందులో చేరి బొమ్మలు వేయటం నేర్చుకోవడంకోసం దరఖాస్తు పంపుకున్నాడు. కానీ అతను వేసిన బొమ్మలు చూసి ఆ పాఠశాల ప్రధాన అధికారి ‘‘అటువంటి బొమ్మలు వేసేవాడు మన పాఠశాలలో విద్యార్థిగా తగడు’’ అంటూ చేర్చుకోలేదని సమాచారం! ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈయన పనిచేస్తున్న కార్యాలయానికి పక్కనే ఆ స్కూలు వుంది. తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ. చవిది పట్టభద్రుడయ్యాడు. చదువుకునే రోజుల్లోనే ఇతను ఫ్రీలాన్స్ చిత్రకారునిగా పనిచేశాడు.

సామాన్య మానవుని సృష్టి

ఇప్పటివరకు భారతదేశ కార్టూన్ రంగచిత్రంలో ఎన్నో పాత్రలు సృష్టించబడ్డాయి కానీ.. లక్ష్మణ్ సృష్టించిన సామాన్య మానవుడు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అతను గీసిన దాదాపు రాజకీయ వ్యంగ్య చిత్రాల్లోనూ సామాన్య మానవుడు దర్శనమిస్తాడు. ఈ సామన్య మానవుడి కార్టూన్ ఎంత ప్రసిద్ధి చెందిందంటే.. ముంబాయిలో వర్లీ సముద్ర తీరంలో ఒక లోహ విగ్రహం ప్రతిష్టించారు. భారతదేశ చరిత్రలోనే ఒక కార్టూన్ పాత్రకు విగ్రహం వుండటం ఇదే మొదటిసారి!

మరికొన్ని విషయాలు :

1983లో బెంగుళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో లక్ష్మణ్ హాజరైనప్పుడు అక్కడ ఒక పత్రికా విలేఖరి.. ‘‘ఇప్పటికీ మీరు కార్టూన్లు వెయ్యటంలో ఆనందం పొందుతున్నారా?’’ అని ప్రశ్నించాడు. దానికి ఆయన చిరునవ్వుతో సమాధానమిస్తూ.. ‘‘ఇదేం ప్రశ్న? తప్పకుండా ఆనందిస్తున్నాను.. నాకు ఇది పుట్టుకతో వచ్చిన విద్య’’ అని చెప్పాడు. ఇతను ముఖ్యంగా రాజకీయ నాయకుల కార్టూన్లు వేసి వారిని ఆటపట్టించేవాడు. ఇతను రాజకీయ నాయకులను తన కార్టూన్ల ద్వారా ఎంత ఆటపట్టించినా.. ఈయనంటే వారందరికీ ఎంతో గౌరవం! అందుకు ఉదాహరణగా.. 2003లో లక్ష్యణ్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు దేశంలో వుండే హేమాహేమీలందరూ ఆయనను ఎప్పటికప్పుడు పరామర్శించాడు. అప్పటి ఉపరాష్ట్రపతి భైరవ్ సింగ్ షేకావత్ కూడా కలిశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rk lakshman  indian cartoonists  irony cartoonists india  telugu news  

Other Articles