Hrithik roshan sussanne khan now legally divorced

Hrithik Roshan, Sussanne Khan, divorce, Bollywood, legally divorced, mumbai, bandra court

hrithik roshan sussanne khan now legally divorced

హృతిక్, సుసాన్నేల మద్య తెగిన ఆలుమగల బంధం..

Posted: 11/01/2014 05:05 PM IST
Hrithik roshan sussanne khan now legally divorced

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ దంపతుల 17 ఏళ్ల ఆలుమగల అనుబంధం నేటితో పూర్తిగా తెగదెంపులైంది. శనివారం బాంద్రా కోర్టు హృతిక్, సుసాన్నెలకు విడాకులు మంజూరు చేసింది. హృతిక్ న్యాయవాది దీపేష్ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు. హృతిక్, సుసాన్నెల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా నివసిస్తున్నారు.

హృతిక్ నుంచి సుసాన్నె వంద కోట్ల రూపాయల భరణం కోరినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే సుసాన్నె వీటిని ఖండించింది. హృతిక్ దంపతులకు ఇద్దరు పిల్లలు రేహన్, హృదన్ ఉన్నారు. పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులకు ఇద్దరికీ సంయుక్తంగా అప్పగించినట్టు న్యాయవాది చెప్పారు. హృతిక్ 2000 వ సంవత్సరంలో సుసాన్నెను పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు నాలుగేళ్ల పాటు వీరు డేటింగ్ చేశారు. గతేడాది డిసెంబర్లో హృతిక్ తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి వేరుగా నివసిస్తున్నా, ఇప్పుడు చట్టబద్ధంగా విడిపోయారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hrithik Roshan  Sussanne Khan  divorce  Bollywood  legally divorced  mumbai  bandra court  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more