Diesel petrol prices cut by rs 2 00 litre ahead of jk jarkhand assembly elections

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC

Diesel & petrol prices cut by Rs 2.00/litre ahead of Jk, jarkhand assembly elections

రూ.2 మేర తగ్గిన ఇంధన ధరలు.. అర్థరాత్రి నుంచే అమలు..

Posted: 11/01/2014 08:14 AM IST
Diesel petrol prices cut by rs 2 00 litre ahead of jk jarkhand assembly elections

యూపీఏ రెండో పర్యాయం అధికారంలో వచ్చినప్పటి నుంచి పెరగడమే తప్ప తరగడం తెలియక పైపైకి ఎగబాకిన చమురు ధరలు గత మూడు నెలలుగా నెమ్మదిగా కిందకు దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.2కు పైగా తగ్గాయి. స్థానిక పన్నులను మినహాయించి పెట్రోలు ధర రూ.2.41, డీజిల్ ధర రూ.2.25 మేర దిగివచ్చాయి. మారిన ధరలు గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆగస్టు నుంచి ఇప్పటివరకు పెట్రోలు ధర తగ్గడం ఇది ఆరోసారి. అప్పటి నుంచి ఇప్పటివరకు లీటరుపై మొత్తం రూ.9.36 పైసల మేర ధర దిగివచ్చింది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర సుమారుగా 78 రూపాయల వరకు ఎగబాకిన ధర..నిన్నటి తగ్గింపుతో సుమారుగా 70 రూపాలకు చేరుకోనుంది.

అలాగే.. అక్టోబరు 18న డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ రేటుకు విక్రయించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత డీజిల్‌ ధరలు తగ్గడం ఇదే రెండవ సారి. నియంత్రణ తొలగించిన వెంటనే స్థానిక పన్నులను మినహాయించి  రూ.3.37 మేర తగ్గిన డీజిల్ ధర మరోమారు నిన్న రాత్రి రెండు రూపాయల 25 పైసలు తగ్గింది. తాజా ధరల ప్రకారం- ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.64.25కు లభిస్తోంది. అక్కడ ఇంతకుముందు దీని ధర రూ.66.65గా ఉండేది అవుతుంది. కాగా... జార్ఖండ్‌, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ఊహించిందేనని మార్కెట్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలలో లబ్ది పోందేందుక ఎన్డీఏ సర్కార్ చేస్తున్న జిమ్మిక్కుగా పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more