Techie booked for secret video graphing young lady while bathing

Software Engineer, Bathroom, Bathing, Cellphone, Woman, secret videographing, humayun nagar, Telangana police

techie booked for secret video graphing young lady while bathing

యువతి స్నానాన్ని చిత్రీకరించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్...

Posted: 10/30/2014 08:39 AM IST
Techie booked for secret video graphing young lady while bathing

చదవుకున్న వాడికన్నా.. చదవు రాని సన్నాసి మేలన్న పెద్దల మాటను నిజం చేశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పక్కింటి బాత్‌రూంలో యువతి స్నానం చేస్తుండగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దొంగచాటుగా తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ ప్రబుద్ధుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెహిదీపట్నం సమీపంలోని హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం... గచ్చిబౌలిలో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దినేష్ (29) రెండు రోజుల క్రితం హుమాయూన్‌నగర్‌లో తన బంధువుల ఇంటికి వచ్చాడు. అతను తన ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుండగా.. ఎదురింట్లోని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే అతను బాత్‌రూమ్ వెంటిలేటర్‌లోంచి చూడగా యువతి స్నానం చేస్తూ కనిపించింది.

అంతే అతను తన సెల్‌ఫోన్ ద్వారా ఆ దృశ్యాలు చిత్రీకరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అలికిడి రావడంతో ఉలిక్కిపడ్డ యువతి వెంటిలేటర్ వైపు చూడగా.. సెల్‌ఫోన్‌తో ఎవరో చిత్రీకరిస్తున్నట్టు కనిపించింది. ఆమె పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి దినేష్‌ను పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి స్నానం చేస్తున్న వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more