9 killed 17 injured in bus accident at nagaon in assam

Bus Accident, 9 Killed, 26 Injured, Assam, Nagaon

9 killed 17 injured in bus accident at nagaon in assam

నెత్తురోడిన అస్సోం రహదారి..9 మంది మృతి

Posted: 10/26/2014 10:35 AM IST
9 killed 17 injured in bus accident at nagaon in assam

అస్సోంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారి నెత్తురోడింది. అధిక వేగం ప్రమాదానికి కారణమని తెలిసిన డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొమ్మిది మంది ప్రాణాలు అనంతవాయువులో కలసిపోయాయి. అస్సోంలో అతివేగం వెళ్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇవాళ అసోంలోని నగాన్ లో చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అసోం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు లక్ష్మీపూర్ జిల్లా నుంచి గౌహతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అస్సోం పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ఐదుగురు  పురుషులు, నలుగురు మహిళలు వున్నట్లు పోలీసులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bus Accident  9 Killed  26 Injured  Assam  Nagaon  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more