Police search in cr reddy college lecturer gousemohiddin house

lecturer gousemohiddin, police checking in lecturer gousemohiddin house, lecturer gousemohiddin cheating cases, cr reddy college lecturer, eluru police, andhrapradesh police, latest telugu news

police search in cr reddy college lecturer gousemohiddin house : eluru police checking continues by second day in cr reddy college lecturer gousemohiddin house. police searching for main affidavits, land registrations and other documents

లెక్చరర్ ఇంట్లో రెండో రోజూ పోలిసుల తనిఖీలు

Posted: 10/23/2014 10:46 AM IST
Police search in cr reddy college lecturer gousemohiddin house

సీఆర్ రెడ్డి కాలేజి పోలిటికల్ సైన్స్ లెక్చరర్ గౌస్మొహిద్దీన్ ఇంట్లో వరుసగా రెండవరోజు పోలిసుల తనిఖీలు జరిగాయి. బుధవారం రాత్రి ఆకస్మికంగా  సెర్చ్ వారెంట్తో వచ్చిన ఏలూరు పోలిసులు ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు, నిరుద్యోగుల ఫొటోలు ఇతర ఆధారాలను సేకరించారు. వీటితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం కూడా పోలిసుల తనిఖీలు కొనసాగాయి.

పోలిసుల వివరాల ప్రకారం, ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ నిరుద్యోగి నుంచి గౌస్మొహిద్దీన్ రూ. 15 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం రాకపోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని నిరుద్యోగి గౌస్పై ఒత్తిడి తెచ్చాడు. రూ. 3 లక్షలు ఇచ్చి మిగతా డబ్బు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో నిరుద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. గతంలో ఎస్ఐ, సీఐ బదిలీలు, ప్రమోషన్లలో కీలక పాత్ర షోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటవుతుందంటూ గౌస్ పలు రియల్ ఎస్టేట్ మోసాలకు కూడా పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలిసులు తనిఖీలు చేశారు.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eluru  lecturer  gousemohiddin  police checkings  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more