Spicejet indigo jet airways start fare war with flash sales discounts

Diwali Dhamaka, Festive Bonanza, Fare Discount, Airfare, SpiceJet, SpiceJet Discount, Indigo, Indigo Fare Discount, Fare War, Flash Sales, Air Ticket Discount

Diwali Dhamaka: SpiceJet, Indigo, Jet Airways start fare war with flash sales, discounts

దీవాళి థమాక.. టిక్కెట్ ధరలను మళ్లీ తగ్గించిన సంస్థలు..

Posted: 10/22/2014 10:45 AM IST
Spicejet indigo jet airways start fare war with flash sales discounts

దీపావళి పండగ సమయాన స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో విమానయాన సంస్థలు మరోసారి చౌక ధరల యుద్ధానికి దిగాయి. దీపావళి సేల్స్ ను తాము సొంతం చేసుకుందామని యోచించిన విమానయాన సంస్థలు విమానచార్జీలను తగ్గిస్తూ పోటీకి దిగాయి. స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు రూ.899 ప్రారంభ ధరతో దేశీయ విమాన మార్గాల్లో ఎక్కడికైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రెండు సంస్థలు విడివిడిగా ప్రకటించాయి. కాగా ఇండిగో మాత్రం పండగ సందర్భంగా టిక్కెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు డిస్కంట్ ధరలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 26వ తేదీలోపు టిక్కెట్లు బుక్ చేసుకన్న వారు మాత్రమే ఈ అవకాశాన్ని అందుకోనున్నారు. ఈ టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు నవంబరు 1 నుంచి డిసెంబరు 15 మధ్య ప్రయాణానికి మాత్రమే అర్హులని కూడా కంపెనీలు ప్రకటించాయి. ఒకవైపు ప్రయాణానికి మాత్రమే ఈ ఛార్జీల తగ్గింపు ధరలు వర్తించనున్నాయి.

స్పైస్‌జెట్ బుకింగ్‌లు మంగళవారం నుండి ప్రారంభం కాగా.. జెట్ టికెట్ బుకింగ్‌లు బుధవారం నుంచి మొదలయ్యాయి. స్పైస్‌జెట్ విషయానికొస్తే.. బెంగళూరు- చెన్నై- కోచి మార్గంలో ప్రయాణానికి ప్రారంభ చార్జీ రూ.899 కాగా, బెంగళూరు- గోవాకు రూ.1,599 నుంచి టికెట్ ధర మొదలవుతుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇవి కాకుండా దేశంలో ఇతర గమ్యస్థానాలకు ప్రయాణించాలంటే రూ.2,499 నుంచి చార్జీలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఇండిగో టిక్కెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more