Us girl injured after iphone blasts in her pocket

iphone blast, us girl injured, burn injuries, pant burnt, washington

us girl injured after iphone blasts in her pocket

అ..ఫోన్ కు కూడా వ్యాపించిన మాయదారి పేలుడు రోగం

Posted: 10/21/2014 06:01 PM IST
Us girl injured after iphone blasts in her pocket

సాదాసీదాగా తయారు చేసిన మొబైల్ ఫోన్ కాదది.. ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ తయారు చేసిన సెల్ ఫోన్. అదే ఐ ఫోన్. దానికి కూడా మాయదారి పేలుడు రోగం వ్యాపించింది. చైనా మొబైళ్లు, లేదా ఇతర సాదారణ కంపెనీల ఫోన్లు పేలడం మనం చూస్తూనే వున్నాం, అయితే ఏకంగా అత్యంత ఖరీదైన.. అందులోనూ నెంబర్ వన్ కంపెనీ నుంచి విడుదలైన మొబైల్ ఫోన్ పేలడమంటే.. విచిత్రంగా వుంది కదూ. అది కూడా అమెరికాలో..  ప్యాంటు జేబులో పెట్టుకున్న ఐఫోన్ ఒక్కసారిగా పేలి.. అంటుకోవడంతో అమెరికాలో ఓ ఎనిమిదో తరగతి అమ్మాయి తీవ్రంగా గాయపడింది. ఆమె క్లాస్ రూంలో ఉండగా ఈ సంఘటన జరిగింది. ఆమెకు తొడమీద, వీపుమీద కాలిన గాయాలయ్యాయి. మైనె ప్రాంతంలోని కెన్నెబంక్స్ మిడిల్ స్కూల్లో చదువుతున్న ఆ అమ్మాయిని ఆస్పత్రిలో చేర్చిన స్కూలు యాజమాన్యం చికిత్స అందిస్తున్నారు.

తాను వేసుకున్న ప్యాంటు కాలిపోతోందని ఆమె చెప్పడంతో వెంటనే ముందు క్లాసులోని పిల్లలందరినీ బయటకు పంపేశారు. తర్వాత ఆమె కింద కూర్చుండిపోయిందని పాఠశాల ప్రిన్సిపల్ జెఫ్రీ రాడ్మన్ తెలిపారు. ఆమె వెంటే గదిలో ఓ మూలకు వెళ్లిపోయి ప్యాంటు తీసేసిందని, ముందుగా స్కూల్లో ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్యాంటు మీద చాలా చిరుగులు పడ్డాయని, తరగతి గది అంతా విపరీతంగా పొగ చూరిపోవడంతో కిటికీలు కూడా తెరిచామని వివరించారు. ఫోన్ ఎందుకు పేలిందన్న విషయాన్ని ఆ రాష్ట్ర ఫైర్ మార్షల్ దర్యాప్తు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iphone blast  us girl injured  burn injuries  pant burnt  washington  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more