Channels that people do not want

TV 9, ABN andhrajyothy, Transmission, Telangana, Subhash Reddy, MSO sangham, state secratary

channels that people do not want

ప్రజలు కోరుకోవడం లేదా..? లేక మీరు ఇవ్వడం లేదా..?

Posted: 10/21/2014 08:42 AM IST
Channels that people do not want

ఆ రెండు చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదా..? వాటిని ఎందుకు కోరుకోవడం లేదు, మిగతా చానళ్లను ఎలా కోరుకుంటున్నారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణలో ప్రజలు ఏ ఏ చానళ్లను కోరుకుంటున్నారు.? వాటినే ఎంఎస్ఓలు ప్రసారం చేస్తున్నారా..? కోరుకోని చానళ్లను ప్రసారం చేయడం లేదా అని సందేహాలు రేకెత్తుతున్నాయి. టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ప్రజలు ప్రసారం చేయాలని కోరుకోవడం లేదని,  వారు కోరుకుంటే ప్రసారం చేస్తామని తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి తెలిపారు. ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్ర ఏమీ లేదని ఆయన నల్గోండలో జరిగిన ఎంఎస్ఓ సంఘం సమావేశంలో అన్నారు.

అంతేకాదు వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు యాజమాన్యాలకు లేదని చెప్పారు. ఉన్నత న్యాయస్థానాలు సైతం ఎంఎస్‌ఓలకు అనుకూలంగానే తీర్పు చెప్పాయని గుర్తు చేశారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంఎస్ఓలు ఏ ఏ ఛానళ్లను ప్రసారం చేయాలి, అసలు మొత్తానికి ఎన్ని చానళ్లను ప్రసారం చేయాలి, శాటిలైట్ చానళ్లను కాకుండా చిన్న తరహా కేబుల్ చానళ్లు వారు ప్రసారం చేయవచ్చా..? వీరికి ఆ తరహా అనుమతులు వున్నాయి..? అయితే వారు చానల్ యాజమాన్యాల నుంచి ఎంత డబ్బును తీసుకోవాలి..? అన్ని శేష ప్రశ్నలే. అందరూ శాఖహారులే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు సరే.. మరి చేప కూర ఏమైందో మీరే చెప్పాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV 9  ABN andhrajyothy  Transmission  Telangana  Subhash Reddy  MSO sangham  state secratary  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more