I am the brand ambassador of ap

Andhra Pradesh, Brand ambassador, Chandrababu, tdp, media delegates, dinner

i am the brand ambassador of ap, says chandrababu at media delegates dinner

ఏపీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అట...

Posted: 10/01/2014 08:19 AM IST
I am the brand ambassador of ap

తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ టన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జాను నియమించడంతో.. అదే బాటలో వెళ్లేందుకు సిద్దమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు అసలు రహస్యాన్ని గుర్తించింది. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఏడు మిషన్లకు ఏడుగురు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలా..? లేక మొత్తానికి ఒక్కరినే నియమించాలా అన్న అంశంపై మల్లగుల్లాలు పడిన ఏపీ సర్కార్.. ఇప్పడు ఆ ఆలోచననే వదిలేసింది. తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని, ప్రస్తుతానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపింది.

ఇంతకీ ఎవరాయనా..? అనుకుంటున్నారా..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌ననీ, కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబే. నిజమేనండి.  లేక్‌వ్యూ అతిథి గృహంలో ఎలక్ట్రానిక్ మీడియా సీఈవోలు, సంపాదకులకు విందు ఇచ్చిన సందర్భంగా ఆయన పలు విషయాలను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిగా తన కంటే ఎవరికి ఎక్కువ పాపులారిటీ వుందని ప్రశ్నించారట. నిజమే కదా..! అంటూ విందును ఆరగించి వెళ్లారట మీడియా ప్రతినిధులు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Brand ambassador  Chandrababu  tdp  media delegates  dinner  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more