Amit shah calls uddhav thackeray on seat sharing in maharashtra

maharashtra elections, amit shah, uddhav thackeray, bjp-shiv sena pact

amit shah calls uddhav thackeray on seat sharing in maharashtra

ఉద్దవ్.. సర్థుకుపోదాం.. రండి..

Posted: 09/22/2014 05:18 PM IST
Amit shah calls uddhav thackeray on seat sharing in maharashtra

మహారాష్ట్రలో మిత్రపక్షాలైన బీజేపి, శివసేన పార్టీల మధ్య తలెత్తిన సీట్ల సర్థుబాటు వ్యవహారంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. పాతికేళ్లుగా ఇరుపార్టీల మధ్య కోనసాగుతున్న స్నేహబంధాన్ని ఇక ముందుకూడా కోనసాగిద్దామని.. అందుకని సీట్ల సర్ధుబాటు విషయంలో పట్టు విడుపులకు పోవాలని కోరినట్టు సమాచారం.

సీట్ల విషయమై శివసేన చేస్తున్న ప్రతిపాదనలను పునరాలోచించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఉద్ధవ్ థాక్రేతో ఫోన్లో మాట్లాడారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని సూచించారు. పొత్తు పెట్టుకోకపోతే ఇరు పార్టీలకు నష్టమని అమిత్ షా తెలిపారు. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరి కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అక్టోబర్ 15వ తేదీన జరగనున్న.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కోసం ఇవాళ ఉదయం ఉద్ధవ్ను పిలిపించిన అమిత్ షా.. రెండు పార్టీల మధ్య బంధం తెగిపోకూడదని సూచించారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాము కనీసం 135 చోట్ల పోటీ చేస్తామని బీజేపీ అంటుండగా, శివసేన మాత్రం 119కి మించి ఇచ్చేది లేదని అంటోంది. రానున్న శుక్రవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో బెట్టు వీడాలని కోరారు. మరి థాక్రే ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharashtra elections  amit shah  uddhav thackeray  bjp-shiv sena pact  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more