Capital is built in best place

capital, best place, sujana chawdary, media

capital is built in best place

అనువైన ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం..

Posted: 09/20/2014 07:27 PM IST
Capital is built in best place

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసిన తరువాత తమ ప్రాంతంలో ఎక్కడ రాజధాని వస్తుందా అంటూ విజయవాడ వాసులు ఉత్కంఠకు గురవుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణలో భాగంగా కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేయడంతో.. వారు ఏ ప్రాంతంలో పరిశీలన జరుపుతున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి బెజవాడ వాసుల్లో నెలకోంది. తమ చెంతలోనే రాజాధాని వస్తున్నా.. అది ఏ ప్రాంతమని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా కూడా ఆసక్తిని కనబర్చింది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని రాజధాని విషయమై ప్రశ్నించింది.

రాజధానికి ఏది అనువైన ప్రాంతం అని భావిస్తే అక్కడే ఏర్పడుతుందని ఆయన నింపాదిగా సమాధానం ఇవ్వడంతో మీడియా అసహనం వ్యక్తం చేసింది. ఎంతో ఉత్కంఠగా సమాధానం కోసం ఎదురుచూస్తే.. ఇలా సమాధానం ఇస్తారా అనుకుందో ఏమిటో.. సూటిగా ఎంపీ ఆస్తుల వివరాలను కోరింది. తనకు బందరులోనూ, కంచికచర్లలోనూ భూములు ఉన్నాయని ఆయన నవ్వుతూ చెప్పారు. తన భూములు ఉన్న చోట రాజధాని ఏర్పాటు అయితే అవవచ్చునని అన్నారు. శాస్త్రీయంగా రాజధానికి ఏది అనువైన ప్రదేశం అని తేలుతుందో అక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : capital  best place  sujana chawdary  media  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more