Student shocks as atm gives 26 lakhs instead of 200

student, shocks, sbh, atm, 26 lakhs, Rs 200, sr nagar, sbh atm, latif, cash draw, police

student shocks as atm gives 26 lakhs instead of 200 at sr nagar sbh atm

రెండు వందలు అడిగితే.. రూ. 26 లక్షలు ఇచ్చింది

Posted: 09/20/2014 12:29 PM IST
Student shocks as atm gives 26 lakhs instead of 200

రెండు వందల రూపాయలు అడిగితే.. ఏకంగా 26 లక్షల రూపాయలు ఇచ్చేసింది. ఇదేంటి విచిత్రంగా వుందనుకుంటున్నారా..? అవునండి.. నిజమే.. కేవలం రెండు వందల రూపాయలను డ్రా చేద్దామనుకుని  కోసం వెళ్లిన ఓ విద్యార్థికి ఏకంగా 26 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇంతకీ ఎవరావిడా అనుకుంటున్నారా..? ఎస్ ఆర్ నగర్ లోని ఎస్ బీ హెచ్ ఏటీయం. రెండు వందల రూపాయలు డ్రా చేసేందుకు ఏటీఎంకు తన స్నేహితుడితో వెళ్లిన లతీఫ్ ఆశ్చర్యానికి లోనయ్యాడు.  లతీఫ్ డబ్బు తీసుకుంటూ ఉండగా..  మిషన్ కింద నుండే తలుపు తెరుచుకుని ఆటోమెటిక్గా తెరుచుకుని.. అందులోంచి డబ్బు కిందపడింది.

షాక్ లో వున్న లతీఫ్ జరిగిన విషయాన్ని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బ్యాంకు అధికారులకు సమాచారం అందించాడు. అయితే బ్యాంక్ అధికారులు తమ పరిధిలోకి రాదని చెప్పటంతో....  లతీఫ్ ఈ విషయాన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులకు తెలిపాడు.  హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు.  అంతకు ముందే ఏటీఎం మిషన్లో డబ్బు పెట్టిన అధికారులు లాక్ వేయకుండా వెళ్లిపోయారని గమనించారు.  సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. బ్యాంక్ సిబ్బందిని పిలిచి విచారణ జరిపారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుతో పాటు సీసీ కెమెరాలు కూడా లేనట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student  shocks  sbh  atm  26 lakhs  Rs 200  sr nagar  sbh atm  cash draw  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more