Compensation to krittika biswas

newyork, indian girl, compensation, Krittika Biswas

court orders Newyork police to compensate indian girl Krittika Biswas

కృతికకు కోటి నలభై లక్షల పరిహారం

Posted: 09/18/2014 11:55 AM IST
Compensation to krittika biswas

భారత దౌత్యవేత్త కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేసి, ఆమెను ఒకరోజు జైల్లో కూడా పెట్టిన అమెరికన్ అధికారులు.. ఎట్టకేలకు తప్పు తెలుసుకున్నారు. తమ తప్పును మన్నించాల్సిందిగా కోరుతూ ఆమెకు నష్టపరిహారాన్ని అందించారు. కోటి నలభై లక్షల రూపాయలను పరిహారంగా అందించేందుకు అంగీకరించారు. టీచర్కు అసభ్య ఈమెయిళ్లు పంపిందన్న అనుమానంతో కృతికా బిశ్వాస్ ను స్కూలు నుంచి అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలోని ప్రముఖ పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. బాలిక అన్న కనికరం కూడా లేకుండా కర్కశత్వంలో కృతిక బిశ్వాస్ ను ఒకరోజు జైల్లో కూడా పెట్టారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను అనవసరంగా అబాసు పాలు చేయవద్దని కృతక అమెరికా అధికారులను కోరింది. అమెరికా పౌరురాలిన తన స్నేహితురాలే ఉపాధ్యాయురాలికి అసభ్య ఈ మెయిల్ పంపిందని చెప్పినా.. అధికారులు పెడచెవిన పెట్టారు. 21=011లో సంచలనం కలిగించిన ఈ ఘటనపై యావత్ భారతావని ఏకమైంది. కృతికపై అగ్రరాజ్యం అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించింది. యావత్ భారతీయులు అండగా నిలవడంతో ధైర్యం కూడ గట్టుకున్న కృతిక.. న్యూయార్క్ నగర అధికారుల మీద, విద్యాశాఖ మీద కోర్టులో కేసు పెట్టింది. దీనిపై విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కోల్టెల్ అధికారులను ఆమెకు పూర్తి సంతృప్తి కలిగేలా 1.4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దాంతో కేసులన్నింటినీ ఉపసంహరించుకునేందుకు బిశ్వాస్ అంగీకరించారు.

కృతికా బిశ్వాస్కు, భారత దౌత్యవేత్తలకు, భారతదేశానికి పరువుకు భంగం కలిగేలా వ్యవహరించినందుకు కోర్టు అధికారులను మందలించినట్లు బిశ్వాస్ న్యాయవాది రవి బాత్రా తెలిపారు. బిశ్వాస్ చాలా గౌరవప్రదమైన విద్యార్థిని అని సెటిల్మెంట్ సమయంలో అధికారులు పేర్కొన్నారు. తనకు ఇన్నాళ్లు అండగా నిలబడినందుకు భారత అమెరికన్ సమాజం, మాజీ రాయబారులు ప్రభు దయాళ్, మీరాశంకర్, మాజీ క్లాస్మేట్లు, టీచర్లు.. అందరికీ కృతిక కృతజ్ఞతలు తెలిపింది..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  NRI  newyork  indian girl  compensation  newyork  indian girl  compensation  Krittika Biswas  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more