Political parties stand on september 17th

september 17th, sepetmber 17th history, telangana, telangana movement, nizam's ruling, hyderabad state, hyderabad country, telangana vileenam, telangana vimochanam, latest news

political parties in telangana have seperate stands on september 17th issue : bjp treated september 17th as telangana vimochana dinam but congress concluded it as telangana vileena dinam

విలీనం.., విమోచనం.., ఎవరిగోల వారిదే

Posted: 09/17/2014 09:52 AM IST
Political parties stand on september 17th

తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి పనిచేశాయి. కానీ.., రాష్ర్టం ఏర్పడ్డాక మాత్రం ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. అధికార పక్షం చేస్తామంటే.., ప్రతిపక్షం వద్దని.., ప్రతిపక్షం కోరుకంటే అధికార పార్టీ పక్కనబెడుతూ వివాదాలను సృష్టించుకుంటున్నారు. తాజాగా సెప్టెంబర్ 17 వ్యవహారంపై కూడా రాజకీయ పార్టీల మద్య వేర్వేరు వాదనలు విన్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ విమోచన దినం అని ప్రకటించింది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేసింది. ఉదయమే పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసింది. నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగాణ ప్రజలకు ఇవాళ విముక్తి లభించిన రోజు అని ప్రకటించింది. ఈ సందర్బంగా కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినంను అధికారికంగా నిర్వహించకపోవటంపై మండిపడింది కూడా.

ఇక తెలంగాణను కష్టపడి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ.., విమోచన దినం కాకుండా విలీనం దినం నిర్వహించుకుంది. వీరి దృష్టిలో తెలంగాణ ఇదే రోజున భారతదేశంలో విలీనం అయిందన్నమాట. ఈ సందర్బంగా వారు కూడా గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఎగరవేసి కాసేపు మాట్లాడారు. ఇలా రెండు పార్టీలు వేర్వేరు విధానాలు పాటిస్తున్నాయి. ఒకే అంశాన్ని విభజించి రెండుగా పంచుకుని జెండా ఎగరేస్తున్ానయి. అయితే ఎవరి ఎజెండాకు తగ్గట్లు వారు ప్రకటనలు చేస్తున్నా.. జెండా మాత్రం ఒకటే ఎగరవేస్తున్నారు. అదే జాతీయ జెండా. ఎవరి గోల వారిదే అన్నట్లు ఉన్నా.., అందరి గోల్ మాత్రం జాతీయ జెండా ఎగురవేయటమే. విలీనం., విమోచనం అర్దాలు కొంచెం ఒకేలా ఉన్నా లోతుగా చూస్తే మాత్రం వేరేగా అర్ధం వస్తుంది. ఈ పేర్లతో విడిపోయిన పార్టీలు.., ప్రజలను కూడా భిన్న భావాలున్న వర్గాలుగా విభజించకుండా ఉంటే మంచిది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : september  vileenam  vimochanam  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more