Police search operation in pahadi sharif

pahadi sharif, mignight, snake gang, snakes, rapes, gang rapes, crime, police search opeartions, arrest, houses, hyderabad news, hyderabad houses, latest news, telangana, cv anand, hyderabad police, cyberabad police

police searching from midnight in pahadi sharif area houses : cv anand and other police searching for more snake gangs in pahadi sharif area from last night

పహాడి షరీఫ్ అర్ధరాత్రి నుంచి తనిఖీలు

Posted: 09/03/2014 08:59 AM IST
Police search operation in pahadi sharif

హైదరాబాద్ శివారులోని పహాడి షరీఫ్ లో పోలిసులు అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. సుమారు 400మంది పోలిసులు 32 బృందాలుగా ఏర్పడి అణువణువూ గాలించారు. అంతేకాకుండా తనిఖీల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన 14 బృందాలు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని గాలింపు చేపట్టాయి. షాహిస్ నగర్ లో ప్రతి ఇంటినీ జల్లెడపట్టారు. ఇంట్లోకి అర్ధరాత్రి వచ్చి సోదాలు చేయటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నేరాల నియంత్రణ కోసం, పలు కేసుల్లో నిందితుల అరెస్టు కోసమని పోలిసులు చెప్తున్నారు.

పాములతో బెదిరించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడే స్నేక్ గ్యాంగ్ ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఇంకా ఈ తరహా గ్యాంగులు ఉన్నాయా? అనే అనుమానంతో పోలిసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్నేక్ గ్యాంగ్ లో ఏ-1 నిందితుడుగా ఉన్న ఫైజల్ దయాని ఇంట్లో ఒక స్కార్పియో, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు. పోలిసులతో కలిసి ఆయన కూడా ఇళ్ళలో సోదాలు జరిపారు. స్నేక్ గ్యాంగ్ సహా ఇతర పద్దతుల్లో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయటం, వారిని వేధించటం వంటి చర్యలను అడ్డుకునేందుకే ఈ తనిఖీలు చేపట్టామని పోలిసులు వెల్లడించారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pahadi sharif  cv anand  snake gang  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more