Woman gave divorced husband for not built toilet

chattisgarh state news, divorced cases, divorce cases in india, toilets, toilet problems india, woman gave divorce husband

woman gave divorced husband for not built toilet

‘‘టాయిలెట్’’ లేదని భర్తకు విడాకులిచ్చిన మహిళ!

Posted: 08/29/2014 11:07 AM IST
Woman gave divorced husband for not built toilet

(Image source from: woman gave divorced husband for not built toilet)

మహిళలు తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం దేనికైనా తెగిస్తారనడానికి ఇదొక మంచి ఉదాహరణ! అత్తవారింట్లో టాయిలెట్ లేదని ఆగ్రహించిన సదరు మహిళ.. బయటకు వెళ్లడం సిగ్గుచేటని భావించి భర్తకు ఏకంగా విడాకులే ఇచ్చిపారేసింది. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ.. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది ఆ అభిమానవతి!

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో వివాహానికి ముందు తమ కూతురికోసం టాయిలెట్‌ను నిర్మించాల్సిందిగా పెళ్లికూతురు తరఫువారు అబ్బాయివారికి ఒక షరతు విధించారు. కేవలం టాయిలెట్టే కదా.. నిర్మిస్తామని వారు చెప్పడంతో అందుకు వారు అంగీకరించి వివాహం జరిపించారు. అయితే వివాహం అయిన తర్వాత భర్తతరఫువారు టాయిలెట్ ఇంకా నిర్మించకపోవడంతో ఆ మహిళ ఆగ్రహంతో కుంగిపోయింది. అప్పటికీ ఆమె ప్రశాంతంగా తన అత్తవారికి టాయిలెట్ నిర్మించాల్సిందిగా చాలాసార్లు కోరింది. ఈ విషయంమీద భార్యాభర్తల మధ్య పలుసార్లు గొడవలు కూడా అయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ.. తన పుట్టించికి వెళ్లి ఫిర్యాదు చేయడం, వాళ్లు అత్తారింటికి వచ్చి సర్దిచేయడం.. ఇలా పదేపదే కొనసాగేది.

అయినప్పటికీ వారు మరుగుదొడ్డిని మాత్రం నిర్మించలేదు. ప్రతిరోజూ గ్రామంలో అందరి ముందు నడుచుకుంటూ బహిర్భూమికి వెళ్ళాల్సి రావడం సిగ్గుచేటని భావించిన సదరు మహిళ.. ఇలా అయ్యేదికాదని భర్తకు విడాకులు ఇచ్చేసి.. తన పుట్టింటికి చేరిపోయింది. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. కుషినగర్ జిల్లాలోని తమ అత్తవారిళ్ళలో టాయిలెట్లు లేకపోవడంతో ఆరుగురు నవ వధువులు పుట్టింటికి చేరడంతో చర్చనీయాంశం అయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chattisgarh  divorce  toilet  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more