Environment lovers protesting to stop linga shooting in karnataka linganamakki dam

super star rajnikanth, rajnikanth latest movie, rajnikanth linga movie, rajnikanth movie, rajnikanth latest news, rajnikanth linga, linganamakki dam, environment lovers, linga movie shooting, linga movie stills, linga movie shooting stills, linga movie photos

Environment lovers protesting to stop linga shooting in karnataka linganamakki dam

రజనీకాంత్ ‘‘లింగా’’ సినిమా షూటింగ్ రద్దు!

Posted: 08/27/2014 11:08 AM IST
Environment lovers protesting to stop linga shooting in karnataka linganamakki dam

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ ‘‘లింగా’’! భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా సరికొత్త సాంకేతిక విధానాలతో రకరకాల లొకేషన్ల మధ్య తీస్తున్న ఈ సినిమా మీద దర్శకనిర్మాతలతోపాటు అభిమానులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసే పనిలో యూనిట్ మొత్తం పరుగులు తీస్తోంది. అయితే తాజా పరిణామాల ప్రకారం వీరు ఆగిపోయేటట్లు కనిపిస్తున్నాయి. రజనీకాంత్ సినిమా షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయాల్సిందేనని డిమాండ్లు వస్తున్నాయి. ఒకవేళ షూటింగ్ ను రద్దు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలూ జారీ చేస్తున్నారు.

మొన్నామధ్యే కర్నాటకలో ఈ సినిమా షూటింగ్ ను ఆపాలంటూ ఆ రాష్ట్రానికి చెందిన కొంతమంది నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! ఆ సమస్య నుంచి ఎలాగోలా బయటపడిన ‘‘లింగా’’.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్నాటకలోని శివమొగ్గ దగ్గరున్న ప్రముఖ జలాశయం లింగనమక్కి వద్ద షూటింగ్ జరుపుకుంటోంది. అయితే నిజానికి ఈ ప్రదేశం పర్యాటక నిషిద్ధ ప్రాంతం. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీయడం కూడా నిషేధమే! ఎంత పెద్ద ప్రముఖ వ్యక్తులు వచ్చినా.. ఇక్కడి అధికారాలను మాత్రం ధిక్కరించకూడదు. అయినప్పటికీ రజనీ ‘‘లింగా’’ సినిమాకు మాత్రం ఇక్కడ షూటింగ్ జరుపుకునేందుకు లభించింది. దీంతో ఇది కొంచెం సంలచనంగా మారిపోయింది.

ఒక్కూట ఆధ్వర్యంలో అక్కడున్న పర్యావరణ ప్రేమికులు ఈ మూవీ షూటింగ్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. డ్యాం రక్షణ దృష్ట్యా నిబంధనలను పాటించాలని వారు కోరుతున్నారు. ఇటువంటి ప్రదేశాల్లో షూటింగ్ లు చేయడం వల్ల అక్కడున్న వాతావరణ పరిస్థితి దెబ్బతినే అవకాశం వుందనే భావనతో వారు ఈ షూటింగ్ ను రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు వారు తక్షణమే షూటింగ్ రద్దు చేయాల్సిందిగా అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మరి వారి డిమాండ్ మేరకు ఈ మూవీ షూటింగ్ ను అక్కడ రద్దు చేస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : super star rajnikanth  linga movie  sonakshi sinha  linganamakki dam  karnataka state  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more